Pelican signal system: ఒక్క స్విచ్ వేస్తే చాలు.. దర్జాగా రోడ్డు దాటేయవచ్చు.. ఈ సిస్టమ్ ఎక్కడుందో తెలుసా ?
పాదాచారులు రోడ్ దాటేటప్పుడు జరిగే ప్రమాదాల నివారించడానికి పిలికాన్ సిగ్నల్ సిస్టం ఎంతో ముఖ్యం. సాధారణంగా విదేశాలలో పిలికాన్ సిగ్నల్ సిస్టం అనేది ఉంటుంది. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే పేలికాన్ సిగ్నలింగ్ సిస్టం మీద అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా బిజీగా ఉన్న రోడ్లపై వేగంగా వెళుతున్న వాహనాలు తప్పించుకుని రోడ్డు అటువైపుకు వెళ్లడం అనేది ఎంతో ప్రమాదం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగిన ప్రమాదానికి గురికాక తప్పదు.
పాదాచారులు రోడ్ దాటేటప్పుడు జరిగే ప్రమాదాల నివారించడానికి పిలికాన్ సిగ్నల్ సిస్టం ఎంతో ముఖ్యం. సాధారణంగా విదేశాలలో పిలికాన్ సిగ్నల్ సిస్టం అనేది ఉంటుంది. అయితే ఇండియాలో ఇప్పుడిప్పుడే పేలికాన్ సిగ్నలింగ్ సిస్టం మీద అవగాహన కల్పిస్తున్నారు. సాధారణంగా బిజీగా ఉన్న రోడ్లపై వేగంగా వెళుతున్న వాహనాలు తప్పించుకుని రోడ్డు అటువైపుకు వెళ్లడం అనేది ఎంతో ప్రమాదం. రోడ్డు క్రాస్ చేసేటప్పుడు ఏ చిన్న పొరపాటు జరిగిన ప్రమాదానికి గురికాక తప్పదు. భారతదేశంలో ఏటా ఆక్సిడెంట్లలో చనిపోతున్న కేసుల్లో రోడ్డు దాటేటప్పుడు జరిగే ప్రమాదాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. వీటిని నివారించేందుకు, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలు పెంచేదుకు సేఫ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా పేలికాన్ సిగ్నలింగ్ సిస్టంని అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
జీబ్రా క్రాసింగ్ వద్ద రోడ్ క్రాస్ చేసేటప్పుడు ట్రాఫిక్ ఆపేందుకు అక్కడ ఏర్పాటు చేసిన ఒక బటన్ నొక్కాలి. బటన్ నొక్కిన తర్వాత రెడ్ లైట్ వెలిగి ట్రాఫిక్ నిలిచిపోతుంది. బటన్ నొక్కిన 10 సెకండ్లలో జీబ్రా క్రాసింగ్ వరకు చేరుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత 20 సెకండ్ల వరకు రెడ్ లైట్ వెలుగుతుంది. 20 సెకండ్లలో రోడ్డును క్రాస్ చేయాల్సి ఉంటుంది. ఈ పేలికాన్ సిగ్నల్స్‌ని రోడ్ కి రెండు వైపులా అమరుస్తారు. అయితే విదేశాలలో పేలికాన్ సిగ్నల్స్‌ని పాదాచారులే ఆపరేట్ చేసుకోవాల్సి ఉండగా ఇక్కడ మాత్రం పేలికాన్ సిగ్నల్స్‌ని ఆపరేట్ చేయటానికి వాలంటీర్లను నియమించారు. పేలికాన్ సిగ్నల్స్‌ని వాడాలంటే కనీసం నలుగురు పాదచారులు ఉండాలి. ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రస్తుతం వాలంటీర్లను నియమించామని భవిష్యత్తులో పాదాచారులే పేలికాన్ సిగ్నల్స్ వినియోగించే విధంగా చేస్తామని అన్నారు. అవగాహన పెరిగేంతవరకు ఫైన్లు ఉండవని భవిష్యత్తులో పేలికాన్ సిగ్నల్స్ నిబంధనలను ఉల్లంఘిస్తే మాత్రం.. సీసీ కెమెరాల ఆధారంగా ఫైన్లు కూడా విధిస్తామని పోలీసులు తెలిపారు.
ఇండియాలో ఫస్ట్ పెలికాన్ సిగ్నలింగ్ సిస్టం ఎక్కడుంది అయితే భారతదేశంలో పేలికాన్ సిగ్నలింగ్ సిస్టం ని అందుబాటులోకి తెచ్చిన మొట్టమొదటి నగరంగా మన హైదరాబాద్ నిలిచింది. మే నెలలో హైదరాబాద్ ట్యాంక్ బండ్ రోడ్డు మీద మొట్టమొదటి టెలికాన్ సిగ్నలింగ్ సిస్టన్ని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రారంభించారు. ప్రధాన కూడళ్లలో పైలెట్ ప్రాజెక్టుగా 31 సిగ్నల్స్ ఏర్పాటు చేశారు. వాటి ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగష్టు 25 న 44 ప్రదేశాల్లో పిలికాన్ సిగ్నల్స్ ని సీపీ స్టీఫెన్ రవీంద్ర ప్రారంభించారు. అయితే ఈ సిస్టం వల్ల రోడ్డు దాటుతుండగా ప్రమాదాలను నివారించవచ్చని ప్రజలు చెబుతున్నారు.
This is a new beginning.✨✨✨🚦. A big step by @HYDTP for Pedestrian safety. ✨Let us use this facility wisely and improve the pedestrian safety in our city. ✨🫡@HiHyderabad @swachhhyd @InsAdmnHYDTP @HMDA_Gov https://t.co/fTo48TsH3q pic.twitter.com/gr4BvDq2Ev
— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) May 17, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..