JP Nadda – Mithali Raj: జేపీ నడ్డాతో ముగిసిన మిథాలీ రాజ్ భేటీ.. రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?

Shiva Prajapati

Shiva Prajapati |

Updated on: Aug 27, 2022 | 2:50 PM

JP Nadda - Mithali Raj: నోవాటెల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ భేటీ ముగిసింది.

JP Nadda - Mithali Raj: జేపీ నడ్డాతో ముగిసిన మిథాలీ రాజ్ భేటీ.. రాజకీయ అరంగేట్రం చేయనున్నారా?
Jp Nadda Mithali

JP Nadda – Mithali Raj: నోవాటెల్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ భేటీ ముగిసింది. ఈ భేటీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, తరుణ్‌ చుగ్‌తో పాటు ఎంపీ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. అయితే, భేటీ అనంతరం బయటకు వచ్చిన మిథాలీరాజ్.. మీడియాతో మాట్లాడకుండానే వెళ్లిపోయారు. ఇక మిథాలీరాజ్‌తో భేటీ అనంతరం బీజేపీ ముఖ్యనేతలతో సమావేశం కానున్నారు బీజేపీ చీఫ్ నడ్డా. అనంతరం శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో వరంగల్‌ బయలుదేరుతారు.

పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా?

కాగా, మిథాలీ రాజ్‌తో నడ్డా భేటీపై ఆసక్తి నెలకొంది. 39 ఏళ్ల మిథాలీ రాజ్ ఉమెన్ క్రికెట్‌లో తనదైన మార్క్ వేసింది. ఇటీవలే తన రిటైర్మెట్ ప్రకటించారు. అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పిన ఆమె తదుపరి ప్రయాణం ఏంటనేదే ఆసక్తికరంగా మారింది. మిథాలీ 23 ఏళ్ల కెరీర్‌లో ఎన్నో రికార్డులు ఉన్నాయి. ఇప్పుడా జోష్‌ పాలిటిక్స్‌లో కంటిన్యూ చేస్తారా అనే చర్చ జరుగుతోంది. జేపీ నడ్డా – మిథాలీతో సమావేశం కావడం వెనుక కారణం ఏంటనేది ఉత్కంఠ రేపుతోంది. జూన్‌లో రిటైర్మెట్‌ ప్రకటించిన మిథాలీరాజ్‌పై ఈమధ్యే సినిమా కూడా వచ్చింది. ఈ సెలబ్రిటీతో ఇప్పుడు బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా సమావేశం కావడం వెనుక లెక్క ఏంటనే దానిపై వీలైనంత తొందర్లోనే క్లారిటీ రానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu