VC Sajjanar: ఇక ఆటాడితే అడ్డంగా బుక్కైనట్లే.. యువత భవిష్యత్‌కు బంగారు బాట: సజ్జనార్ ఇంట్రెస్టింగ్ ట్వీట్..
ఆన్‌లైన్ బెట్టింగ్యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించడానికి, అలాగే చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెడీ అయింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆటలు ఆడితే భారీగా జరిమానాలు విధించడంతోపాటు.. ప్లాట్‌ఫాంను నిషేధిస్తారు.

ఆన్‌లైన్ బెట్టింగ్యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌తో ఇప్పటికే చాలామంది ప్రాణాలు తీసుకున్నారు. అక్రమార్కులు ఈ యాప్‌ల ద్వారా ఎన్నో అక్రమాలకు పాల్పడుతూ.. ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి వాటిపై చర్యలు తీసుకునేందుకు భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ బెట్టింగ్యాప్స్, ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్స్‌ను నియంత్రించడానికి, అలాగే చర్యలు తీసుకునేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం రెడీ అయింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం మంగళవారం ఆమోదం తెలిపింది. ప్రతిపాదిత చట్టం ప్రకారం.. ఆన్లైన్లో డబ్బులు పెట్టి ఆటలు ఆడితే భారీగా జరిమానాలు విధించడంతోపాటు.. ప్లాట్‌ఫాంను నిషేధిస్తారు. అలాగే.. బెట్టింగ్, గేమింగ్ యాప్‌లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడం.. ఉల్లంఘించేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది.. ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.
ఎన్నో జీవితాలను నాశనం చేయడంతోపాటు.. వేలాది మంది యువకులను బలి తీసుకున్న ఆన్‌లైన్ బెట్టింగ్‌ను నిషేధించాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సీనియర్ ఐపీఎస్ అధికారి, టీజీఎస్‌ఆర్‌టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ బుధవారం స్వాగతించారు.. దీనిని చారిత్రాత్మక అడుగుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం చర్య అనేక మంది ప్రాణాలను కాపాడటమే కాకుండా, జూదం వ్యసనం ప్రమాదకరమైన పరిణామాల నుండి సమాజం – సామాజిక నిర్మాణాన్ని కూడా కాపాడుతుందని ఆయన ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.
#SayNoToBettingApps movement sees success as Centre decides to ban online betting apps
The Central Government’s decision to ban online betting, which has been destroying countless young lives, is a highly welcome and historic step. This move will not only save many lives but… pic.twitter.com/2LDNUvvqGS
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) August 20, 2025
‘‘ఎంతో మంది యువకుల ప్రాణాలు తీస్తోన్న ఆన్ లైన్ బెట్టింగ్ ను నిషేధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం శుభపరిణామం. భారత దేశ యువత బంగారు భవిష్యత్ కు బాటలు వేసుకునేందుకు ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుంది. యువతను మానసిక, ఆర్థిక బానిసత్వం నుండి కాపాడే ఈ చర్య సమాజాన్ని ఆరోగ్యకర దిశగా నడిపిస్తుంది. యువకుల్లారా!? ఇకనైనా బెట్టింగ్ యాప్స్‌కు దూరంగా ఉండండి! మీ నైపుణ్యాలను, సమయాన్ని విద్య, కెరీర్, సృజనాత్మకత కోసం ఉపయోగించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టి బంగారు భవిష్యత్తును నిర్మించుకోండి!’’ అంటూ వీసీ సజ్జనార్ ట్వీ్ట్ చేశారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
