Hyderabad: ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు.. సహస్రను చంపిందెవరు..? 2 రోజులు గడుస్తున్నా వీడని మిస్టరీ..
పదేళ్ల పాప సహస్ర.. అభంశుభం తెలియని బాలిక. స్కూల్‌కి సెలవిస్తే ఇంట్లో ఉంది. అంత చిన్న పాపను కత్తితో అతి క్రూరంగా పొడిచి పొడిచి చంపడానికి ఆ దుర్మార్గుడికి మనసెలా వచ్చిందో? కత్తిపోట్లతో విలవిల్లాడిపోయిన సహస్ర.. ఎంత నరకం అనుభవించిందో! అమ్మా నన్ను కాపాడు.. నాన్నా నన్ను రక్షించు.. కాపాడు దేవుడా అంటూ నెత్తినోరు ఎలా మొత్తుకుందో.. తల్చుకుంటేనే కన్నీళ్లు వస్తాయి.

పదేళ్ల పాప సహస్ర.. అభంశుభం తెలియని బాలిక. స్కూల్‌కి సెలవిస్తే ఇంట్లో ఉంది. అంత చిన్న పాపను కత్తితో అతి క్రూరంగా పొడిచి పొడిచి చంపడానికి ఆ దుర్మార్గుడికి మనసెలా వచ్చిందో? కత్తిపోట్లతో విలవిల్లాడిపోయిన సహస్ర.. ఎంత నరకం అనుభవించిందో! అమ్మా నన్ను కాపాడు.. నాన్నా నన్ను రక్షించు.. కాపాడు దేవుడా అంటూ నెత్తినోరు ఎలా మొత్తుకుందో.. తల్చుకుంటేనే కన్నీళ్లు వస్తాయి. ఆ చిట్టి తల్లి ఎంత నరకం అనుభవించి చనిపోయిందో తల్చుకుంటే గుండె తరుక్కుపోతుంది. నెత్తుటి మడుగులో రాలిపోయిన ఆ చిన్నారి ఎంత వేదన అనుభవించిందో మాటల్లో చెప్పలేం. ఈ ఘోరానికి పాల్పడ్డవాళ్లకు ఎంత కఠినమైన శిక్ష వేసినా సరిపోదంటున్నారు కూకట్‌పల్లివాసులు..
కూకట్‌పల్లి బాలిక హత్యకేసుపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.. 2 రోజులు గడుస్తున్నా బాలిక హత్యపై మిస్టరీ వీడలేదు.. అయితే.. పోస్టుమార్టం సమయంలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.. బాలిక ఒంటిపై 20కి పైగా కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. 25 ఏళ్ల వ్యక్తి హత్యచేసి ఉండొచ్చని వైద్యులు అంచనా చేశారు. దీంతో బాలిక పోస్ట్‌మార్టం రిపోర్ట్ కీలకంగా మారింది. ఇప్పటికే.. ముగ్గురు అనుమానితులను ప్రశ్నించిన పోలీసులు.. పలువురిని ప్రశ్నించే అవకాశం ఉంది.. సీసీ ఫుటేజ్ డేటా ఆధారంగా దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు.
ఈ దారుణ హత్య సోమవారం కూకట్‌పల్లిలో జరిగింది. ఒంటరిగా ఉన్న 10 ఏళ్ల బాలికను దుండగులు దారుణంగా హత్య చేశారు. అదే సమయంలో బాలిక తల్లిదండ్రులు పని కోసం బయటకు వెళ్లారు. ఇదే అదనుగా సహస్రని హత్య చేశారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చిన తండ్రి బాలిక హత్య గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకున్నారు. మృతదేహనాన్ని పోస్ట్‌మార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టిం ద్వారా ఆధారాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
