Golconda Fort: ఇండిపెండెన్స్‌డే వేడుకలకు సిద్ధమైన గోల్కొండ కోట.. జెండా ఎగురవేయనున్న సీఎం..

Golconda Fort: ఇండిపెండెన్స్‌డే వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమవుతోంది. ఇక్కడ ఇప్పటికే రిహార్సల్స్‌ నిర్వహించారు పోలీస్‌ అధికారులు.

Golconda Fort: ఇండిపెండెన్స్‌డే వేడుకలకు సిద్ధమైన గోల్కొండ కోట.. జెండా ఎగురవేయనున్న సీఎం..
Golconda Fort
Follow us

|

Updated on: Aug 14, 2022 | 10:12 AM

Golconda Fort: ఇండిపెండెన్స్‌డే వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమవుతోంది. ఇక్కడ ఇప్పటికే రిహార్సల్స్‌ నిర్వహించారు పోలీస్‌ అధికారులు. సీఎం కార్యక్రమానికి సర్వం సిద్ధం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తోంది. ఈ ఏడాది కూడా గోల్కొండ కోటలోనే నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

75వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జెండా ఎగురవేస్తారు. దీనికి సంబంధించి గోల్కొండ కోటలో ఫైనల్ పరేడ్, సీఎం కాన్వాయి రిహర్సల్ నిర్వహించారు అధికారులు. దీన్ని తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సి.వి ఆనంద్, ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

75వ ఇండిపెండెన్స్‌ డే వేడుకల్లో ఉన్నతాధికారులు, విఐపిలతో పాటు సామాన్య ప్రజలు కూడా పాల్గొంటారు. దీంతో ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా ఆయా విభాగాల అధికారులు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ సోమేశ్ కుమార్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో ఎవరికి ఎలాంటి అసౌకర్యం జరక్కుండా అన్ని చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. ఇప్పటికే కొన్ని రోజులుగా గోల్కొండ కోట దగ్గర పరేడ్‌ రిహార్సల్స్‌ జరుగుతున్నాయి. మరోవైపు పోలీస్‌ బందోబస్తు కూడా భారీగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారి ప్రతి కదలికలను పోలీసులు డేగ కళ్లతో పహారా కాస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..