TS BJP: తెలంగాణ బీజేపీ కార్యాలయంలో వాస్తు మార్పు.. కారణం ఏంటో తెలుసా.?
మొన్నటివరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తూర్పు ద్వారం నుండే రాకపోకలు ఉండేవి. ఇప్పుడు తూర్పు ద్వారాన్ని మూసేసేందుకు బీజేపీ అగ్ర నాయకులు నిర్ణయించుకున్నారు . తూర్పు ద్వారానికి బదులు ఉత్తర ద్వారం నుండి రాకపోకలు జరపాలని నిర్ణయించారు. బీజేపీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ఒక వేళ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చేరువలో సీట్లు వస్తే.. ఫలితాల్లో బీజేపీకి వచ్చే సీట్లే కీలకంగా ఉన్నాయి...

తెలంగాణ బీజేపీ మరో వాస్తు మార్పునకు తెరలేపింది.. రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తుంది బీజేపీ. ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కొన్ని మార్పులు చేస్తుంది. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి 15లోపు సీట్లకే అన్ని సర్వేలు తేల్చడంతో సీట్ల సంఖ్య పెరుగుదలకు బీజేపీ వాస్తు మార్పునే నమ్ముకుంది. ఇందుకోసం నాంపల్లిలో ఉన్న బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయం రాకపోకల ద్వారాన్ని మార్చే పనిలో ఉంది బీజేపీ.
మొన్నటివరకు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తూర్పు ద్వారం నుండే రాకపోకలు ఉండేవి. ఇప్పుడు తూర్పు ద్వారాన్ని మూసేసేందుకు బీజేపీ అగ్ర నాయకులు నిర్ణయించుకున్నారు . తూర్పు ద్వారానికి బదులు ఉత్తర ద్వారం నుండి రాకపోకలు జరపాలని నిర్ణయించారు. బీజేపీ ఈ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుంది. ఒక వేళ కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌కు చేరువలో సీట్లు వస్తే.. ఫలితాల్లో బీజేపీకి వచ్చే సీట్లే కీలకంగా ఉన్నాయి. పోలింగ్ నుంచి ఫలితాలు ప్రకటన వరకు తూర్పు ద్వారం మూసివేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. దీంతో ఇప్పటికే పోలింగ్ ముగిసింది కాబట్టి ఉత్తర ద్వారం నుండే రాకపోకలు కొనసాగిస్తున్నారు.
ఇక ఫలితాలు ప్రకటనకు మరో రెండు రోజులు సమయం ఉంది కాబట్టి ఈ రెండు రోజులపాటు ఉత్తర ద్వారం నుంచి రాకపోకలు చేయనున్నారు. ఇలా చేస్తే మేలు జరిగి బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయని నమ్మకంతో తూర్పు ద్వారాన్ని మూసివేసినట్టు సమాచారం. మరి బీజేపీ చేస్తున్న ఈ వాస్తు మార్పులు ఆ పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చిపెడుతుందో వేచి చూడాలి. తమకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాలపై బీజేపీ ఎక్కువగానే శ్రద్ధ పెట్టింది. నియోజకవర్గాల్లో పోలింగ్ సర్వే తమకు అనుకూలంగా ఉందని బీజేపీ నేతలు విశ్వాసంతో ఉన్నారు. అన్ని కలిసి వస్తే ప్రభుత్వ ఏర్పాటులో బీజేపీ కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు.
గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ ఇలాంటి ఫార్ములానే తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. సాధారణంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రెండు ద్వారాల నుంచి రాకపోకలు జరిగేవి. గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల సమయంలోనూ ఇలాంటి నమ్మకాన్ని బీజేపీ విశ్వసించింది. దీంతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి సీట్లు లభించాయి. ఇప్పుడు ఇదే రీతిలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం తమకు అనుకూలంగా ఉంటాయని బీజేపీ విశ్వసిస్తుంది. డిసెంబర్ 3న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..
