Telangana: ఆ కీచకులను చెప్పుతో కొట్టండి.. గుండెలు పిండేస్తున్న యువతి సూసైడ్ లెటర్..

Telangana: మహబూబాబాద్ జిల్లాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. కొందరు మృగాళ్ల అరాచకానికి ఓ యువతి నిండు ప్రాణం బలైపోయింది. తన జీవితం ఆగం చేశారని,

Telangana: ఆ కీచకులను చెప్పుతో కొట్టండి.. గుండెలు పిండేస్తున్న యువతి సూసైడ్ లెటర్..
Woman
Follow us
Shiva Prajapati

|

Updated on: Feb 23, 2022 | 10:29 PM

Telangana: మహబూబాబాద్ జిల్లాలో పెను విషాద ఘటన చోటు చేసుకుంది. కొందరు మృగాళ్ల అరాచకానికి ఓ యువతి నిండు ప్రాణం బలైపోయింది. తన జీవితం ఆగం చేశారని, ఆ నీచులను చెప్పుతో కొట్టాలంటూ బాధిత యువతి రాసిన చివరి లేఖ(సూసైడ్ లెటర్) హృదయాలను పిండేస్తుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామానికి చెందిన యువతి(23)పై నలుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. వారి దురాగతంతో తీవ్ర మనస్తాపానికి గురైన యువతి.. కొద్ది రోజులపాటు తనలో తానే కుమిలిపోయింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఎవరికీ చెప్పుకోలేక నరకయాతన అనుభవించింది. చివరికి ఇక తన బతుకు వ్యర్థం అని భావించి.. ఈ నెల 18న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. యువతి పురుగుల మందు తాగడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఇవాళ ప్రాణాలు కోల్పోయింది యువతి. అయితే, ఆత్మహత్యాయత్నం చేసే ముందు బాధిత యువతి సూసైడ్ లెటర్ రాయగా.. ఆ లెటర్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఆ లేఖలో నలుగురు నిందితుల పేర్లను వెల్లడించిన యువతి.. ఆ నలుగురూ తన జీవితాన్ని నాశనం చేశారని, వారిని చెప్పుతో కొట్టాలని పేర్కొంది. తాను పిరికిదాన్ని కాదని, ఈ అవమాన భారాన్ని మోయలేనంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాధితురాలి సూసైడ్ లెటర్ ఆధారంగా నలుగురు వ్యక్తులైన.. యాట సాగర్, సద్దాం హుస్సేన్, నజీం, కోయిలకొండ జగదీష్‌లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఆలేరు గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలించారు.

Also Read:

Statue of Equality: సమతాస్ఫూర్తి కేంద్ర సందర్శకులకు అనుమతి.. టైమింగ్స్ ఇవే..

Medaram Jathara 2022: మేడారం హుండిల తొలిరోజు కౌంటింగ్ పూర్తి.. జస్ట్ 65 హుండీల ఆదాయం ఎంతంటే..!

Watermelon: సమ్మర్ సీజన్ వచ్చేస్తోంది.. పుచ్చకాయతో అదిరిపోయే ప్రయోజనాలు