HYDRA: ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై సంచలన విషయాలు బయటపెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అంతుచూస్తోంది. సామాన్యుడైనా, వీఐపీ అయినా... అందరికి ఒకే రూల్‌ అంటూ దూసుకెళ్తోంది. అందులోభాగంగానే... నటుడు నాగార్జునకి చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్‌-కన్వెన్షన్‌ హాల్‌ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు.

HYDRA: ఎన్ కన్వెన్షన్ నిర్మాణంపై సంచలన విషయాలు బయటపెట్టిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
HYDRA
Follow us
Balaraju Goud

|

Updated on: Aug 24, 2024 | 6:46 PM

హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ కట్టడాల అంతుచూస్తోంది. సామాన్యుడైనా, వీఐపీ అయినా… అందరికి ఒకే రూల్‌ అంటూ దూసుకెళ్తోంది. అందులోభాగంగానే… నటుడు నాగార్జునకి చెందిన మాదాపూర్‌లో ఉన్న ఎన్‌-కన్వెన్షన్‌ హాల్‌ను హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. తమ్మిడికుంట చెరువుపై అక్రమంగా నిర్మించారని పెద్ద ఎత్తున హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో… యాక్షన్‌ తీసుకున్నారు. కన్వెన్షన్‌ హాల్‌ను కూల్చొద్దంటూ నాగార్జున హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నా… జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

హైదరాబాద్‌ మాదాపూర్‌‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పందించారు. తుమ్మడికుంట చెరువులోని ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలో భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించారని స్పష్టం చేశారు. ఈ కన్వెన్షన్ నిర్మాణానికి జీహెచ్ఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు లేవని తేల్చి చెప్పారు. ఈ మేరకు రంగనాథ్‌ శనివారం(ఆగస్ట్ 24) సాయంత్రం ఒక ప్రకటన విడుదల చేశారు. తుమ్మడికుంట చెరువులోని ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్లలోని ఆక్రమణలను హైడ్రా, జీహెచ్‌ఎంసీ, టౌన్‌ప్లానింగ్‌, రెవెన్యూ సిబ్బందితో కలిసి కూల్చివేసినట్లు తెలిపారు. చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఎకరం 12 గుంటలు.. బఫర్‌ జోన్‌ పరిధిలోని 2 ఎకరాల 18 గుంటల్లో ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిర్మించారని ఏవీ రంగనాథ్ వెల్లడించారు. నిర్మాణానికి ఎలాంటి అనుమతులు లేవని, బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ – బీఆర్ఎస్ కింద అనుమతుల కోసం ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్ యాజమాన్యం ప్రయత్నించిందని.. అయితే సంబంధిత అధికారులు మాత్రం అందుకు అనుమతించలేదని హైడ్రా కమిషనర్ స్పష్టం చేశారు.

ఇక తుమ్మడికుంటపై 2014లో హెచ్‌ఎండీఏ అధికారులు నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్‌ తర్వాత ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం హైకోర్టుకు వెళ్లిందని.. దానిపై స్పందించిన కోర్టు.. చట్టబద్ధంగా ఉండాలని గతంలోనే ఆదేశించనట్లు రంగనాథ్ చెప్పారు. 2017లో ఎఫ్‌టీఎల్‌ సర్వే నివేదికపై కేసు పెండింగ్‌లో ఉందని, ఎన్‌ కన్వెన్షన్‌కు సంబంధించి ఇప్పటివరకు ఏ కోర్టు కూడా స్టే ఇవ్వలేదని రంగనాథ్ స్పష్టం చేశారు. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌కు సంబంధించి ఎన్‌ కన్వెన్షన్‌ తప్పుదోవ పట్టించి వాణిజ్య కార్యక్రమాలు సాగించిందని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

ఎన్‌-కన్వెన్షన్‌ నేలమట్టమైంది. ఇక హైడ్రా నెక్ట్స్‌ టార్గెట్‌ ఎవరు…? మాదాపూర్‌లో ఇంకెన్ని అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు గుర్తించారు…? అక్రమంగా నిర్మించిన ప్రముఖుల బిల్డింగులను ఎన్‌-కన్వెన్షన్‌ మాదిరే కూల్చేస్తారా….? అసలు హైడ్రా నెక్ట్స్‌ స్టెప్‌ ఏంటి…? కబ్జా భూముల్లో నిర్మాణాలు చేసిన వీఐపీలు ఎవరు..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..