YS Sharmila: దీక్షలో ఆహార్యం మార్చిన వైఎస్ షర్మిల.. పోచంపల్లి చీరలో..

YS Sharmila Deeksha : తెలంగాణలో ఉద్యోగదీక్ష చేపట్టారు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర ఆమె దీక్షకు దిగారు..

YS Sharmila: దీక్షలో ఆహార్యం మార్చిన వైఎస్ షర్మిల.. పోచంపల్లి చీరలో..
Ys Sharmila
Follow us

|

Updated on: Apr 15, 2021 | 12:29 PM

YS Sharmila Deeksha : తెలంగాణలో ఉద్యోగదీక్ష చేపట్టారు వైఎస్‌ షర్మిల. రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ.. హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ దగ్గర ఆమె దీక్షకు దిగారు. సాయంత్రం 5 గంటల వరకు షర్మిల ఉద్యోగదీక్ష కొనసాగనుంది. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న నేతలను షర్మిల ఈ దీక్షకు ఆహ్వానించారు. “పిల్లలు చనిపోతుంటే కేసీఆర్ కి కనిపించడం లేదా.. మీరు గడిలో నిద్రపోతున్నారా? మీ ఛాతీ లో ఉంది గుండె లేక బండ రాయా?” అంటూ షర్మిల దీక్షాస్థలి నుంచి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ” 40 లక్షల మంది యువత తెలంగాణలో ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం చూస్తున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేయూలో సునీల్ నాయక్, మహేందర్ యాదవ్ నల్లగొండకు చెందిన సంతోష్ కుమార్ ఉరి వేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా.. దున్నపోతు మీద వాన పడినట్లు కేసీఆర్ పరిస్థితి ఉంది. ఆయన పాలనలోనే ఇంతమంది యువకులు చనిపోతుంటే కేసీఆర్ కి కన్పించడం లేదా..?” అంటూ షర్మిల తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. “కేసీఆర్.. నీ ఛాతీలో ఉన్నది.. గుండెనా.. బండనా..! ఈ పరిస్థితి మారాలి. లక్షకు పై చిలుకు ఉద్యోగాలు భర్తీ చేయాలి. అందరి తరుపున మేము నిలబడతాం. వారికి న్యాయం జరగాలి. ఆత్మహత్యలకు బాధ్యుడు కేసీఆర్ కాదా..? నోటిఫికేషన్లు ఇస్తే వారు బతికేవారు కదా.? వారి కుటుంబాలకు క్షమాపణ చెప్పాలి” అని షర్మిల డిమాండ్ చేశారు. అంతేకాదు, తెలంగాణ యువతకు ఉద్యోగాల కోసం 72 గంటలు దీక్ష కొనసాగిస్తా. 4 వ రోజు నుంచి జిల్లాల వారీగా ర్యాలీలు చేపడతాం అంటూ కేసీఆర్ సర్కారుకి ప్రశ్నల వర్షం కురిపించారు షర్మిల.

కాగా, ఈ రోజు మరో కాటన్ పోచంపల్లి చీరలో షర్మిల దీక్షలో కూర్చున్నారు. అటు, ఆమె ఆహార్యం కూడా శిబిరంలో స్పెషల్ అట్రాక్షన్  అయింది. కాగా, ఇటీవల ఖమ్మంలో జరిగిన సంకల్పసభలో కూడా షర్మిల కట్టు, బొట్టు ప్రత్యేకమయ్యాయి. తెలంగాణలో ప్రాచూర్యం పొందిన పోచంపల్లి చీరను ధరించడం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నిమ్మపండు రంగులో నీలం అంచు చీర కట్టుకుని ఆరోజు ప్రత్యేకంగా నిలిచారు షర్మిల. మోచేతుల వరకు జాకెట్‌ ధరించి హుందాగా కనిపించారు. పూర్థి స్థాయి రాజకీయాల్లోకి రాక ముందు చీరలో అరుదుగా కనిపించారు షర్మిల. అయితే ఇప్పుడు ప్రజల్లోకి వస్తుండటంతో వస్త్రధారణలో తన ప్రత్యేకతను చాటుతున్నారు వైఎస్ షర్మిల.

Read also : India reports record corona cases : కోరలు చాస్తోన్న కరోనా, ఒక్కరోజులోనే దేశంలో రెండు లక్షల కేసులు