Hyderabad: ప్రేయసి పెళ్లి ఫోటోలు చూసి ముక్కలైన హృదయం.. జేబులో మంగళసూత్రం పెట్టుకుని ఆత్మహత్య

ప్రేయసి మెడలో మరొకరు మూడు ముళ్లు వేయడాన్ని అతడు తట్టుకోలేకపోయాడు. ఆపై వారి పెళ్లి ఫోటోలు కంటపడడంతో ప్రేమించిన గుండె ముక్కలైంది.

Hyderabad: ప్రేయసి పెళ్లి ఫోటోలు చూసి ముక్కలైన హృదయం.. జేబులో మంగళసూత్రం పెట్టుకుని ఆత్మహత్య
Ganesh
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 15, 2023 | 8:36 AM

యువతిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాడు. ఆమెకు కూడా అతడిని లవ్ చేసింది. జీవితాంతం కలిసి బ్రతుకుదామని మాటిచ్చింది. కానీ ఉన్నఫలంగా వేరే వ్యక్తితో పెళ్లి పీటలు ఎక్కింది. దీంతో అతడి హృదయం ముక్కలైంది. ప్రేయసి పెళ్లి ఫోటోలు చూసి.. అతడు తల్లడిల్లిపోయాడు. ప్రపంచమంతా చీకటి అయినట్లు అనిపించింది. దీంతో తాను ఆమె మెడలో కట్టాలనుకున్న తాళిని జేబులో పెట్టుకొని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హయత్‌నగర్‌ పోలీస్ స్టేషన్  పరిధిలో జరిగింది.

రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్‌ మున్సిపాలిటీ పరిధిలోని మునగనూరు గ్రామం వినాయకనగర్‌ కాలనీలో పందిగొట్ల లక్ష్మయ్య, అనంతమ్మ దంపతులు ముగ్గురు కుమారులతో కలిసి నివాసముంటున్నారు. వీరి రెండో తనయుడైన గణేశ్‌(23) లారీ డ్రైవర్‌‌గా పని చేస్తున్నాడు. తన సమీప ప్రాంతంలో ఉండే యువతిని ఏడాదిగా లవ్ చేస్తున్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. ఆమెకు పేరెంట్స్ ఇటీవలే మరో యువకుడితో మ్యారేజ్ చేశారు. ఆ పెళ్లి ఫొటోలను ఆమె.. గణేశ్‌కి వాట్సప్‌లో సెండ్ చేసింది. యువతి పక్కన పెళ్లి కొడుకుగా తన బదులు.. మరొకరు ఉండటం చూసి.. అతడు జీర్ణించుకోలేకపోయాడు. సోమవారం రాత్రి ఎవరికీ చెప్పకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. మంగళవారం ఉదయం మునగనూరు శివారులో ఓ చెట్టుకు నిర్జీవంగా వేలాడుతూ కనిపించాడు. గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.  అతని జేబులో మంగళసూత్రం ఉంది. పోలీసులు కేసు ఫైల్ చేసి.. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
మళ్ళీ స్వల్పంగా పెరిగిన పసిడి వెండి ధరలు.. నేడు ప్రధాన నగరాల్లో..
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
ఇకపై సీసీ కెమెరాల నీడలోనే ఇంటర్‌ ప్రాక్టికల్స్‌.. ఇంటర్ బోర్డు
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
కయ్యానికి కాలు దువ్విన కోహ్లీ.. కట్‌చేస్తే.. భారత్‌కు బిగ్ షాక్
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
'ఈ ఏడాది 7 కోట్ల ఉద్యోగ దరఖాస్తుల్లో 2.8 కోట్లు మహిళలవే..'
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
IND vs AUS: మెల్‌బోర్న్ టెస్టు నుంచి గిల్ ఔట్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
Horoscope Today: ఉద్యోగంలో వారికి హోదా పెరిగే ఛాన్స్..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్