Hyderabad: మొబైల్ ఫోన్స్ పోయాయని.. యువకుడి విపరీత నిర్ణయం.. తుకారం గేట్ వద్ద
ఎంత చిన్న విషయం ఇది... మంచి జాబ్ సంపాదిస్తే దాని బాబు లాంటి ఫోన్ కొనవచ్చు. నచ్చిన బైక్ కొనుక్కొవచ్చు. ఎంచక్కా ఎంజాయ్ చేస్తూ లైఫ్ గడిపేయవచ్చు. కానీ ఇతడు మాత్రం ఊహించని విధంగా చేశాడు.

ఈ మధ్యకాలంలో కొంతమంది యువత చిన్న, చిన్న విషయాలకే విపరీత నిర్ణయాలు తీసుకుంటున్నారు. కనీసం ఆలోచించుకుండా నిండైనా ప్రాణాలు తీసుకుంటున్నారు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా ఎంత విలువైన ప్రాణాన్ని తృణప్రాయంగా మార్చేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ బోరబండలో అదే జరిగింది. బోరబండకు చెందిన యువకుడు సాయి కుమార్ తన మొబైల్ ఫోన్స్ పోయాయన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుకారాం గేట్ రైల్వే ట్రాక్ దగ్గర రైలు కింద పడి జీవితాన్ని చాలించాడు. EMI పద్దతిలో ఆ ఫోన్స్ కొనుగోలు చేశాడు సాయి కుమార్. అవి పోవడంతో.. ఈ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన అన్నకు ఫోన్ చేసి “అన్నా.. అమ్మానాన్నలను జాగ్రత్తగా చూసుకో.. నేను వెళ్ళిపోతున్నాను” అంటూ ఫోన్ కట్ చేసి.. ప్రాణం తీసుకున్నాడు.
ఎంతో విలువైనది ప్రాణం. బాగా ఇష్టపడి చదివి.. దానికి కష్టాన్ని జోడిస్తే.. భవిష్యత్‌లో ఏకంగా మొబైల్ ఫ్యాక్టరీనే పెట్టొచ్చు. కానీ క్షణాకావేశంలో అతడు తీసుకున్న ఈ నిర్ణయం.. కుటుంబాన్ని విషాదంలోకి నెట్టింది. ప్రతి సమస్యకు కచ్చితంగా పరిష్కారం ఉంటుంది. దయచేసి ఆత్మహత్యల జోలికి వెళ్లవద్దు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం