AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khairatabad Ganesh: వినాయక చవితికి సర్వం సిద్ధం.. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఎత్తు, బరువు ఎంతో తెలుసా..?

Khairatabad Ganesh 2023: వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల గణేష్ నవరాత్రులకు సర్వం సిద్ధమవుతోంది. అయితే, వినయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు.. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడికి అంతటి ప్రత్యేకమైన స్థానం ఉంది. నవరాత్రుల్లో ఖైరతాబాద్ గణనాథుడిని లక్షలాది మంది దర్శించుకుని.. మొక్కులు తీర్చుకుంటారు.

Khairatabad Ganesh: వినాయక చవితికి సర్వం సిద్ధం.. ఖైరతాబాద్ గణనాథుడి విగ్రహం ఎత్తు, బరువు ఎంతో తెలుసా..?
Khairatabad Ganesh
Shaik Madar Saheb
|

Updated on: Sep 14, 2023 | 1:13 PM

Share

Khairatabad Ganesh 2023: వినాయక చవితి వేడుకలు సెప్టెంబర్ 18 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని చోట్ల గణేష్ నవరాత్రులకు సర్వం సిద్ధమవుతోంది. అయితే, వినయక చవితి అనగానే మనకు గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు.. దేశ వ్యాప్తంగా హైదరాబాద్ లోని ఖైరతాబాద్ గణేషుడికి అంతటి ప్రత్యేకమైన స్థానం ఉంది. నవరాత్రుల్లో ఖైరతాబాద్ గణనాథుడిని లక్షలాది మంది దర్శించుకుని.. మొక్కులు తీర్చుకుంటారు. ఈ తొమ్మిది రోజులు కూడా ఖైరతాబాద్ గణేష్ మండపం.. తెలుగు రాష్ట్రాల్లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనుంది. అయితే, ఈ సారి ఖైరతాబాద్ గణనాథుడు శ్రీదశ మహా విద్యా గణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఈ గణనాథుడి విగ్రహ తయారీ ఇప్పటికే పూర్తయిందని.. గణేష్ ఉత్సవానికి సర్వం సిద్ధమైనట్లు గణేష్ ఉత్సవ కమిటీ కన్వీనర్ సందీప్ రాజ్ వెల్లడించారు. సెప్టెంబర్ 18 వినాయక చవితి రోజున పూజలు ఘనంగా ప్రారంభమవుతాయని.. దీనికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా దాదాపు పూర్తయినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

ఈసారి ఖైరతాబాద్ గణేషుడు 63 ఎత్తులో.. 22 అడుగుల వెడల్పుతో రూపుదిద్దుకున్నాడు. గతేడాది 58 అడుగుల ఎత్తులో గణనాథుడు దర్శనమిచ్చాడు. ఇది గత సంవత్సరం కంటే 13 అడుగులు ఎక్కువ.. అయితే, ఈసారి పర్యవరణాన్ని దృష్టిలో ఉంచుకుని పూర్తిగా మట్టితో విఘ్నేశ్వరుడిని తయారు చేశారు. ప్రస్తుతం గణనాథుడి విగ్రహానికి తుది మెరుగులు పూర్తికాగా.. చిన్న చిన్న పనులను పూర్తిచేస్తున్నారు. ఇదిలా ఉండగా, మూడు నెలల నుంచే గణేష్ విగ్రహ పనులు ప్రారంభమయ్యాయి. అప్పటినుంచి పనులు వేగంగా జరుగుతున్నాయి. గణేష్ చతుర్థి సెప్టెంబర్ 18న, విగ్రహాన్ని ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. ఈ సారి కూడా గతేడాది మాదిరిగానే 900ల కేజీలకు పైగా గణానాథుడి లడ్డూ ఉండొచ్చని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఆర్డర్ కూడా ఇప్పటికే ఇచ్చారు.

గతేడాది మాదిరిగానే.. ఈ సంవత్సరం కూడా మట్టితో విగ్రహం తయారు చేశారు. సుమారు 150 మంది వ్యక్తులు మూడు షిఫ్టులలో పనిచేసి విగ్రహాన్ని నిర్మాణాన్ని పూర్తిచేశారు. విగ్రహాల తయారీలో 30 ఏళ్ల పాటు అనుభవజ్ఞులైన సుప్రసిద్ధ విగ్రహ కళాకారులు చెన్నైకి చెందిన రాజేంద్రన్, ఒడిశాకు చెందిన మట్టి కళాకారుడు జోగారావు దీనిని రూపొందించారు. కాకినాడ సత్య ఆర్ట్స్‌కు చెందిన కలర్ ఆర్టిస్టులు రంగులతో తీర్చిదిద్దారు.

విగ్రహం బరువు 45-50 టన్నుల వరకు ఉంటుందని అంచనా. ఫ్రేమ్ కోసం ఇప్పటివరకు 22 టన్నుల ఉక్కును ఉపయోగించగా, రాజస్థాన్ నుంచి 40,000 కిలోల మట్టిని తీసుకువచ్చారు. ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు నుంచి 40 కిలోల జ్యూట్ పౌడర్ 1000 బస్తాలు, యాదాద్రి నుంచి వరి పొట్టు సేకరించారు. అయితే, వర్షం కారణంగా పనులు కొంత ఆలస్యం అయ్యాయి. విగ్రహ తయారీ పనులు ముగియడంతో.. వినాయక చవితి నాటి నుంచి నిత్యపూజలు ప్రారంభం కానున్నట్లు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తెలిపింది.

కాగా ఖైరతాబాద్‌లో ఎప్పటి నుంచి లంబోదరుడి విగ్రహాన్ని ప్రతిష్టిస్తూ వస్తున్నారు. గత 69 ఏళ్లుగా ఖైరతాబాద్‌లో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి నవరాత్రుల్లో ఘనంగా పూజలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఇది 70 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ వెల్లడించింది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..