బంగారం చోరీ కేసు: దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్‌

రోజురోజుకు కొత్త రూపం సంతరించుకుంటున్న టెక్నాలజీ ఎన్నో కేసులను చేధించడానికి కూడా సహాయపడుతోంది. టెక్నాలజీ మోజులో ఉన్న

బంగారం చోరీ కేసు: దొంగను పట్టించిన వాట్సాప్ స్టేటస్‌
TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 31, 2020 | 4:28 PM

Whatsapp status theft case: రోజురోజుకు కొత్త రూపం సంతరించుకుంటున్న టెక్నాలజీ ఎన్నో కేసులను చేధించడానికి కూడా సహాయపడుతోంది. టెక్నాలజీ మోజులో ఉన్న కొందరు దొంగలు ఇచ్చే చిన్న క్లూలు వారిని పట్టిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో ఓ మహిళ పెట్టిన వాట్సాప్ స్టేటస్‌ 15 నెలల నాటి బంగారం చోరీ కేసును చేధించేందుకు ఉపయోగపడింది. (మాల్దీవులకు పంపమన్న నెటిజన్‌.. సోనూ అదిరిపోయే రిప్లై)

వివరాల్లోకి వెళ్తే.. రాచకొండ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని సాయిపురి కాలనీలో నివసించే రవి కిరణ్‌ ఇంట్లో గత ఏడాది దొంగతనం జరిగింది. వారి కుటుంబం గుడికి వెళ్లి వచ్చే లోపు ఇంట్లో చోరీ జరిగింది. దీంతో రవి కిరణ్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇక ఇటీవల అతడి పొరుగింటి మహిళ వాట్సాప్‌లో ఓ స్టేటస్‌ పెట్టింది. అందులో ఆమె ఓ బంగారు ఆభరణాన్ని ధరించి ఉండగా.. అది తమదేనని రవి కిరణ్‌ గుర్తించారు. ఈ విషయాన్ని అతడు పోలీసులకు వివరించారు. ఈ క్రమంలో రవి కిరణ్‌ పొరుగింటి వారిని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రవి కిరణ్‌ ఇంటి పక్కన నివసించే పొన్నుగోటి జితేందర్‌ ఈ దొంగతనం చేసినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అలాగే ఈ విషయం అతడి తల్లికి ముందే తెలియడంతో ఆమెకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ( Corona Updates: దేశంలో 81లక్షలు దాటిన కేసుల సంఖ్య)

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu