జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కిన పేకాటాడుతోన్న మహిళలు

గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు ప్రముఖులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అ ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా సంపన్న కుటుంబాలకు చెందిన డాక్టర్లు, న్యాయవాదులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి సెల్‌ఫోన్లతోపాటు […]

జూబ్లీహిల్స్ పోలీసులకు చిక్కిన పేకాటాడుతోన్న మహిళలు
Venkata Narayana

|

Oct 31, 2020 | 2:37 PM

గుట్టుచప్పుడు కాకుండా ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పలువురు ప్రముఖులను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్‌ వెంకటగిరిలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నట్లు టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అ ఇంటిపై దాడి చేసి వివిధ రంగాలకు చెందిన 11 మంది వ్యాపార ప్రముఖులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో నలుగురు మహిళలు కూడా ఉన్నారు. వీరంతా సంపన్న కుటుంబాలకు చెందిన డాక్టర్లు, న్యాయవాదులుగా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరి నుంచి సెల్‌ఫోన్లతోపాటు 3 లక్షల 45 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu