పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు

చిత్తూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై సుమారు వందమంది మహిళలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. స్టేషనరీని చెల్లాచెదురు చేశారు. అద్దాలు పగుల గొట్టి నానా హంగామా చేశారు.

పోలీస్‌స్టేషన్‌పై దాడి..ధర్నాతో రెచ్చిపోయిన మహిళలు
Follow us

|

Updated on: Oct 31, 2020 | 2:14 PM

Women attack on police station: చిత్తూరు జిల్లాలో ఓ పోలీస్ స్టేషన్‌పై సుమారు వందమంది మహిళలు దాడి చేశారు. ఫర్నీచర్ ధ్వంసం చేశారు. స్టేషనరీని చెల్లాచెదురు చేశారు. అద్దాలు పగుల గొట్టి నానా హంగామా చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసు సిబ్బందిపై కూడా మహిళలు అటాక్ చేశారు. అద్దాలు పగుల గొడుతున్న సమయంలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన మహిళలు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం పోలీస్ స్టేషన్ పరిధిలోని యనమల మంద అనే గ్రామంలో ఎస్సీ కాలనీలో ఓ బాల్యవివాహం జరిగింది. మైనర్ బాలికకు వివాహం చేశారు. ఈ వివాహానికి సహకరించాడన్న అభియోగంతో బాబు అనే ఓ యువకుడిని వెదురుకుప్పం పోలీసులు అరెస్టు చేశారు. విచారణ పేరిట బాబును పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని గ్రామస్తులు ఆగ్రహం చెందారు. సుమారు వంద మంది మహిళలలు వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌పై దాడికి దిగారు. ఫర్నీచర్ విధ్వంసం చేశారు. అద్దాలు పగుల గొట్టారు. స్టేషనరీని చెల్లాచెదురు చేశారు. విధ్వంసాన్ని అడ్డుకునేందుకు యత్నించిన పోలీసు సిబ్బందిపై కూడా మహిళలు దాడి చేశారు.

పోలీస్ స్టేషన్‌పై దాడి అనంతరం పోలీస్ స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించారు మహిళలు, యనమల మంద గ్రామస్తులు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. డీఎస్పీ మురళీధర్, సీఐ సురేందర్ రెడ్డి హుటాహుటిన వెదురుకుప్పం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. అయితే అధికారులు రాకుండా గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించడంతో పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత ఏర్పడింది.

అయితే, ఎలాగోలా పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న డీఎస్పీ, సీఐ యనమల మంద ఎస్సీ కాలనీ ప్రజలకు నచ్చచెప్పేందుకు ప్రయత్నించారు. అకారణంగా బాబును కొట్టిన పోలీసులను సస్పెండ్ చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. పరిస్థితి జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్‌కు తెలియడంతో మొత్తం ఉదంతంపై నివేదికకు ఆదేశించినట్లు సమాచారం. పోలీసులపై చర్యల తీసుకునే దాకా ఆందోళన కొనసాగిస్తామని యనమల మంద ఎస్సీ కాలనీ వాసులు చెబుతున్నారు.

ALSO READ: ఒక్క కారు..మూడు బైకులు.. ఒకేసారి ఢీ

ALSO READ:  సూరత్‌లో గోల్డ్ స్వీటు..ఖరీదు కిలో 9వేలు