ఎంత డబ్బున్నా లాభం లేదు : మంత్రి ఈటెల

ఎంత డబ్బు ఉన్నా మానసిక ప్రశాంతత లేకుంటే లాభం లేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో 53 వ మానసిక నిపుణుల సదస్సును మంత్రి ఇవాళ ప్రారంభించారు. యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతత కోల్పోయి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “సైకియాట్రిస్ట్ లకు గతంలో అంతగా గుర్తింపు ఉండేది కాదు.. మనం వినకూడని, చూడని సమస్యలని మనం ఎన్నో చూస్తున్నాం. ఒక దిశ ఘటన, […]

ఎంత డబ్బున్నా లాభం లేదు : మంత్రి ఈటెల
Follow us

|

Updated on: Oct 31, 2020 | 12:44 PM

ఎంత డబ్బు ఉన్నా మానసిక ప్రశాంతత లేకుంటే లాభం లేదని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్‌లో 53 వ మానసిక నిపుణుల సదస్సును మంత్రి ఇవాళ ప్రారంభించారు. యాంత్రిక జీవనంలో మానసిక ప్రశాంతత కోల్పోయి ప్రజలు అనేక రోగాల బారిన పడుతున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. “సైకియాట్రిస్ట్ లకు గతంలో అంతగా గుర్తింపు ఉండేది కాదు.. మనం వినకూడని, చూడని సమస్యలని మనం ఎన్నో చూస్తున్నాం. ఒక దిశ ఘటన, ఒక నిర్భయ ఘటన.. వంటివి మొత్తం మానవాళిని కదిలిస్తున్నాయి. మనిషికి అన్ని సుఖాలు ఉన్నాయ్ కానీ మానసిక ఆనందం లేదు. మనుషులు రోగాలకు లక్షల రూపాలు ఖర్చు పెడుతున్నారు. దీనికి కారణం సరియైన సైకియాట్రిస్ట్ లేక ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పెషేంట్ కి ట్రీట్మెంట్ అంటే కేవలం మందులే కాదు…మొదట ఆ పెషేంట్ కి మానసికంగా ఉన్న సమస్యలు తెల్సుకోవాలి. భవిషత్తులో ఎంబిబిఎస్ తర్వాత సైకియార్టిస్ట్ కు కూడా తెలంగాణ లో సరైన తోడ్పాటు అందిస్తాం” అని ఈటెల పేర్కొన్నారు.