Hyderabad: ప్రేమించి పెళ్లి చేసుకున్నవాడే ఆమెను ముక్కలుగా నరికేశాడు..
జూబ్లీహిల్స్‌లో దారుణం చోటు చేసుకుంది. ఎస్‌పీఆర్ హిల్స్‌లో రెండో భార్యను భర్త అతి కిరాతకంగా హతమార్చాడు. అనంతరం భార్య మృతదేహాన్ని డ్రమ్ములో పెట్టి దుస్తులు కప్పి వెళ్లిపోయాడు.
Telangana News: హైదరాబాద్ జూబ్లీహిల్స్(Jubilee Hills)లో మరో దారుణం వెలుగుచూసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త.. తన భార్యను అత్యంత పైశాచికంగా హత్య చేశాడు. శవాన్ని ముక్కలుగా నరికి డ్రమ్ములో కుక్కాడు. మిస్సింగ్ కేసుగా దర్యాప్తు చేస్తోన్న క్రమంలో నిజం వెలుగుచూసింది. నిందితుడు అనిల్ కుమార్ నేరచరిత్ర కూడా తెరపైకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. మహబూబ్‌నగర్(Mahabubnagar)కు చెందిన అనిల్‌కుమార్..సరోజ భార్యభర్తలు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నాళ్లు అంతా సజావుగా నడిచింది. కానీ రాను రాను అతని అసలు రంగేంటో తెలిసిపోయింది. తరుచూ గొడవ పడేవాడు. అనిల్‌కు అంతకు ముందే మరో పెళ్లయింది. ఆమెను హత్య చేశాడనే అభియోగంపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు కూడా వుంది. 2 నెలల పాటు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై బయటికి వచ్చాడు. అలాంటివాడితో పెళ్లి వద్దని చెప్పినా సరోజా వినలేదని వాపోయారు ఆమె పేరెంట్స్. వాళ్లు భయపడినంత పనైంది. సరోజాకు ఫోన్ చేస్తే రెస్పాన్స్ రాకపోవడంతో డౌట్ పడిన ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. అనిల్ కు ఫోన్ చేస్తే అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పడమే తప్ప సరోజా ఎక్కడుందో చెప్పకపోవడంతో అనుమానాలు కలిగాయి. ఎందుకైనా మంచిదని తాళం బ్రేక్ చేసి లోనికి వెళ్లే ఒక్కసారి దుర్వాసన గుప్పు మంది. పోలీసుల సమక్షంలో తనిఖీలు చేస్తే డ్రమ్ములో సరోజ శవమై కన్పించింది.
మిస్సింగ్ కేసును మర్డర్ కేసుగా ఆల్టర్ చేశారు పోలీసులు. పరారీలో వున్న నిందితుడు అనిల్ కోసం గాలింపు చేపట్టారు. దర్యాప్తులో అనిల్ మొదటి పెళ్లి వ్యవహారం.. మొదటి భార్యను హత్య చేయడం సహా అతని నేరచరిత్ర ఒక్కోక్కటిగా వెలుగులోకి వచ్చాయి. డంబెల్‌తో సరోజ తలపై బాది హత్య చేసి.. డ్రమ్ములో పడేసి అనిల్ పారిపోయి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సరోజ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి