AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కలకలం

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి […]

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ కలకలం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Sep 04, 2019 | 7:58 AM

Share

హైదరాబాద్‌లో లవ్ జిహాద్ వ్యవహారం కలకలం రేపుతోంది. రఫీక్ అనే యువకుడు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడని ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. బలవంతంగా తన మతం మార్చి పెళ్లి చేసుకొని అవసరం తీరాక వదిలేసి వెళ్లిపోయాడని ఆరోపించింది. ఈ మేరకు మల్కాజిగిరి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం (సెప్టెంబర్ 3) ఫిర్యాదు చేసింది. బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు.. వరంగల్‌కు చెందిన కృష్ణవేణి, రఫీక్ ఆరేళ్లు ప్రేమించుకున్నారు. ఆ తర్వాత రఫీక్ ఆమె మతం మార్పించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి తర్వాత కృష్ణవేణి పేరును షబానాగా మార్పించాడు.

మొదట్లో బాగానే ఉన్న రఫీక్ ఆ తర్వాత వేధించడం ప్రారంభించాడని బాధితురాలు తెలిపింది. గర్భం దాల్చిన తర్వాత పుట్టింటి నుంచి డబ్బులు తేవాలంటూ వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. నాలుగు సార్లు అబార్షన్ చేయించాడని తెలిపింది. తాజాగా మరోసారి తాను మరోసారి గర్భం దాల్చాక తనను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రఫీక్‌పై పోలీసులకు ఇప్పటికే నాలుగు సార్లు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపింది. పోలీసులు కూడా అతణ్ని స్టేషన్‌కు పిలిపించి పలుమార్లు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పారిపోయిన రఫీక్ కోసం గాలింపు చేపట్టారు.

భాగ్యనగరంలో మూడు నెలల కిందట లవ్ జిహాద్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తమ కుమార్తెను మతం మార్చి ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె తల్లిదండ్రులు పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించారు. ప్రేమ పేరుతో తమ కుమార్తెను మత మార్పిడి చేసి, ఎవరికీ తెలియకుండా దాచారంటూ మంచిర్యాలకు చెందిన రేణుక, మహేశ్ దంపతులు ఫిర్యాదు చేశారు. తాజాగా మరో లవ్ జిహాద్ ఉదంతం వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. ఈ సంస్కృతి ఇప్పుడు హైదరాబాద్‌లోనూ విస్తరిస్తుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది..

సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సాయి పల్లవి, శ్రీలీల రెమ్యునరేషన్స్ ఎన్ని కోట్లంటే..
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
సమీరారెడ్డి దగ్గర ఉన్న స్పెషల్ బ్లౌజ్ ధర ఎంతో తెలుసా?
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో హస్తం హవా.. పదుల సంఖ్యలో హంగ్
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
శివ భక్తులకు రైల్వేశాఖ మరో శుభవార్త
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
విజయ్ సభలో అభిమాని మృతి సంచలనం.. డీఎంకే–టీవీకే మధ్య మాటల యుద్ధం
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
నేనే రాజు.. నేనే మంత్రి.! మున్సిపల్ ఎన్నికల్లోనూ వార్ వన్ సైడే..
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పెంపుడు పిల్లుల నుంచి పాఠాలు నేర్చుకున్నానంటున్న స్టార్ హీరోయిన్‌
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
పాక్ బౌలర్ వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కు ఇచ్చిపడేసిన ఇషాన్..
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
కేరళ స్టైల్ సాంబార్ రైస్ రెసిపీ.. ఇలా చేస్తే ముద్ద కూడా వదలరు!
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..
పులి ఎముకలకు అన్ని కోట్లా.? మీరు అస్సలు ఊహించలేరు..