AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devdutt Padikkal Girlfriend: దేవదత్ పడిక్కల్ మనసు దోచిన ఈ భామ ఎవరు?.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

Devdutt Padikkal Girlfriend: శ్రీలంకతో జరుగుతున్న గాలె టెస్టులో దేవదత్ పడిక్కల్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మెరిశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 167 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 44 పరుగులతో సత్తా చాటాడు. అయితే మైదానంలో పడిక్కల్ బ్యాటింగ్ ఎంత మార్మోగుతోందో, ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో అంతకంటే ఎక్కువగా వైరల్ అవుతోంది.

Devdutt Padikkal Girlfriend: దేవదత్ పడిక్కల్ మనసు దోచిన ఈ భామ ఎవరు?.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Devdutt Padikkal Girlfriend
Rakesh
|

Updated on: Aug 18, 2026 | 1:26 PM

Share

Devdutt Padikkal Girlfriend: శ్రీలంక గడ్డపై భారత జట్టు పట్టు సాధించడంలో దేవదత్ పడిక్కల్ కీలక పాత్ర పోషించాడు. క్లిష్టమైన పిచ్‌పై ప్రత్యర్థి బౌలర్లను ఎదుర్కొంటూ అద్భుతమైన సెంచరీ సాధించాడు. రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఏకంగా 211 పరుగులు చేసి జట్టుకు భారీ ఆధిక్యాన్ని అందించాడు. ఈ ఆటకు క్రికెట్ అభిమానులు ఫిదా అవుతుండగానే, మరోవైపు పడిక్కల్ డేటింగ్ వార్తలు నెట్టింట తెగ వైరల్ కావడం మొదలైంది.

ఎవరీ రియాంజలి నాంజప్ప?

సోషల్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం దేవదత్ పడిక్కల్, రియాంజలి నాంజప్ప అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రియాంజలి వృత్తిరీత్యా డిజైనర్, పాటరీ ఆర్టిస్ట్ (మట్టి పాత్రల కళాకారిణి) అని సమాచారం. ఐపీఎల్ మ్యాచ్‌లు, పలు ఇతర ప్రైవేట్ కార్యక్రమాల్లో కూడా వీరిద్దరూ కలసి ఉన్న ఫోటోలు గతంలో పలుమార్లు బయటకు వచ్చాయి. గాల్ టెస్ట్ సమయంలో రియాంజలికి సంబంధించిన ఫోటోలు మళ్లీ నెట్టింట ప్రత్యక్షమవ్వడంతో వీరి బంధంపై రూమర్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.

అధికారిక ప్రకటన లేని ప్రేమాయణం

వీరిద్దరి రిలేషన్‌షిప్‌పై నెటిజన్లు ఎంత రచ్చ చేస్తున్నప్పటికీ, దీనిపై ఎలాంటి స్పష్టత లేదు. పడిక్కల్ గానీ, రియాంజలి గానీ తమ బంధాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలను బట్టి అభిమానులు రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. పెళ్లి వార్తలు లేదా ప్రేమ వ్యవహారంపై ఇరువైపుల నుంచి స్పష్టత వస్తే తప్ప దీనిపై నిశ్చితమైన నిజం తెలిసే అవకాశం లేదు.

జాతీయ జట్టులో లభించిన గొప్ప అవకాశం

వ్యక్తిగత విషయాలు పక్కన పెడితే, భారత టెస్ట్ జట్టులో లభించిన అవకాశాన్ని పడిక్కల్ చక్కగా వినియోగించుకుంటున్నాడు. దేశవాళీ క్రికెట్ మ్యాచ్‌లలో, ఐపీఎల్‌లో అద్భుతంగా రాణించి జాతీయ జట్టులోకి వచ్చిన పడిక్కల్, ఇప్పుడు గాల్ టెస్టులో సాధించిన భారీ సెంచరీతో తన స్థానాన్ని మరింత బలీయం చేసుకున్నాడు. క్రికెట్ కెరీర్ పరంగా ఆయన సాధిస్తున్న ఈ పురోగతి పట్ల క్రీడా విశ్లేషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొత్త బ్యాంకింగ్ రూల్స్.. నిబంధనల్లో భారీ మార్పులు..
కొత్త బ్యాంకింగ్ రూల్స్.. నిబంధనల్లో భారీ మార్పులు..
టాటూతో తంటాలే.. ఈ ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..
టాటూతో తంటాలే.. ఈ ఒక్క చిన్న పొరపాటుతో ప్రాణాలకే ఎసరు..
దుస్థాన బుధుడు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
దుస్థాన బుధుడు.. ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త..!
సనత్‌నగర్ టిమ్స్‌లో సూపర్ ట్రీట్‌మెంట్.. ఈ స్పెషాలిటీలు తెలిస్తే
సనత్‌నగర్ టిమ్స్‌లో సూపర్ ట్రీట్‌మెంట్.. ఈ స్పెషాలిటీలు తెలిస్తే
కష్టాల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన ఫ్రెండ్.. ఆ 5 సంకేతాలు ఇవే
కష్టాల్లో మీకు అండగా నిలిచేవాడే నిజమైన ఫ్రెండ్.. ఆ 5 సంకేతాలు ఇవే
నా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒకే ఒక పని అదే..
నా జీవితంలో సంతోషాన్నిచ్చే ఒకే ఒక పని అదే..
సాంబార్‌లో మునక్కాడలు ఎందుకు వేస్తారు? దీని వెనకున్న కథ తెలుసా?
సాంబార్‌లో మునక్కాడలు ఎందుకు వేస్తారు? దీని వెనకున్న కథ తెలుసా?
మాటల్లో పెట్టి.. మాయం.. ముక్కుపుడక కోసం వచ్చి ఏం చేశారో..
మాటల్లో పెట్టి.. మాయం.. ముక్కుపుడక కోసం వచ్చి ఏం చేశారో..
మీ పెదవుల ఆకారమే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా?
మీ పెదవుల ఆకారమే మీ వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుందని తెలుసా?
చియా సీడ్స్‌ను ఎంతసేపు నానబెట్టాలి.. ఎలా తినాలి..?
చియా సీడ్స్‌ను ఎంతసేపు నానబెట్టాలి.. ఎలా తినాలి..?