మందు కొట్టి బండి నడిపితే..జాబ్ బంద్

తెలంగాణ విద్యుత్ శాఖ తమ ఉద్యోగులకు ఈ మధ్య ఓ నోటీసు జారీ చేసిందట. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అందులో హెచ్చరించారు. విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి కానీ, అర్టిజన్ కానీ, మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. దీన్ని ఉల్లంఘిస్తే వారి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇటీవల విద్యుత్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసుల డ్రంక్ అండ్ […]

మందు కొట్టి బండి నడిపితే..జాబ్ బంద్
Follow us
Ram Naramaneni

|

Updated on: May 08, 2019 | 7:42 PM

తెలంగాణ విద్యుత్ శాఖ తమ ఉద్యోగులకు ఈ మధ్య ఓ నోటీసు జారీ చేసిందట. విద్యుత్ శాఖలో పనిచేసే ఉద్యోగులు ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపకూడదని అందులో హెచ్చరించారు. విద్యుత్ శాఖ నిబంధనల ప్రకారం ఏ ఉద్యోగి కానీ, అర్టిజన్ కానీ, మద్యం సేవించి బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు. దీన్ని ఉల్లంఘిస్తే వారి ఉద్యోగాలు ఊడిపోతాయి. ఇటీవల విద్యుత్ శాఖకు చెందిన ఓ ఉద్యోగి మద్యం తాగి వాహనం నడిపారు. పోలీసుల డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. అతడికి పోలీసులు జరిమానా విధించారు. అతడి వివరాలు తెలుసుకునే క్రమంలో ఆ వ్యక్తి తెలంగాణ విద్యుత్ శాఖలో పనిచేస్తాడని తెలిసింది. దీంతో తెలంగాణ విద్యుత్ శాఖకు నోటీసులు పంపింది. ‘మీ ఉద్యోగులను హెచ్చరించండి. మద్యం తాగి వాహనాలు నడపొద్దని చెప్పండి.’ అంటూ ఓ నోటీసు పంపించారు. ఈ లేఖను పరిగణనలోకి తీసుకున్న విద్యుత్ శాఖ తమ ఉద్యోగులను హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేసింది. మద్యం తాగి వాహనం నడపడం వల్ల మీ జీవితాలు రిస్క్‌లో పడడమే కాదు. రోడ్డు మీద వెళ్లే వారి జీవితాలు కూడా ప్రమాదంలో పడతాయని హితవు పలికింది. తమ ఆదేశాలు అతిక్రమించి మద్యం తాగి వాహనాలు నడిపితే ఉద్యోగం ఊడిపోతుందని గట్టిగా హెచ్చరించింది.