Hyderabad: హైదరాబాద్‌లో పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం.. ఎక్కడెక్కడ అంటే..
హైదరాబాద్‌లో ఈ నెల11వ తేదీన పనుల కారణంగా పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు ఆటంకం ఏర్పడనుంది. ఆయా ప్రాంతాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు సూచించారు.
పలుచోట్ల మంచినీటి సరఫరాకు అంతరాయం ============================= హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-1, 1200 ఎంఎం డయా ఎంఎస్ గ్రావిటీ మెయిన్ పైపులైన్ కు చాంద్రాయన్‌గుట్ట ఓమర్ హోటల్ వద్ద ఫూట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం జరగనుంది. ఈ నేపథ్యంలో మిరాలం ఆలియాబాద్ ఆఫ్‌టేక్ పైప్‌లైన్ అలైన్‌మెంట్ మార్చాల్సి ఉంది. దీంతో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని హెచ్ఎండబ్ల్యూఎస్ అధికారులు తెలిపారు. తేదీ 11.10.2021( సోమవారం) ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు అనగా తేదీ 12.10.2021 మంగళవారం ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. కాబట్టి ఈ 24 గంటలు వరకు మిరాలం ఆలియాబాద్ ఆఫ్‌టేక్ నుంచి నీటి సరఫరా జరిగే రిజర్వాయర్ల పరిధిలోని ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.
అంతరాయం ఏర్పడే ప్రాంతాలు: 1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 1 -మీరాలం, కిషన్ బాగ్, అల్ జుబైల్ కాలనీ రిజర్వాయర్ ప్రాంతాలు. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 -అలియాబాద్, బాలాపూర్ రిజర్వాయర్ ప్రాంతాలు.
నీటి సరఫరాలో అంతరాయం కలుగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని అధికారులు సూచించారు.
Also Read: ‘చీటర్స్’ ట్వీట్‌పై హీరో సిద్దార్థ్ క్లారిటీ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు
‘కుంగుబాటు నుంచి కోలుకునేందుకు కొంత టైమ్ ఇవ్వండి’.. సమంత భావోద్వేగ లేఖ