AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Inter First Year Exams: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. ఏ పరీక్ష ఎప్పుడంటే..

హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నిక దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈమేరకు కొత్త తేదీలకు బోర్డు ప్రకటించింది...

TS Inter First Year Exams: ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. ఏ పరీక్ష ఎప్పుడంటే..
Inter
Srinivas Chekkilla
|

Updated on: Oct 08, 2021 | 7:13 PM

Share

హుజురాబాద్ అసెంబ్లీ ఎన్నిక దృష్ట్యా ఇంటర్ మొదటి సంవత్సరం రెగ్యులర్ పరీక్ష షెడ్యూల్లో మార్పులు చేశారు. ఈమేరకు కొత్త తేదీలకు బోర్డు ప్రకటించింది. హుజూరాబాద్ ఉపఎన్నికల పోలింగ్‌తో పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు ఇంటర్​ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ తెలిపారు. అక్టోబర్ 29, 30న జరగాల్సిన పరీక్షలు.. ఈనెల 31, నవంబరు 1కి మార్చినట్లు తెలిపారు. ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సర పరీక్షలు అక్టోబరు 25వ తేదీ నుంచి జరగనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి.

పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు కొవిడ్ నిబంధనలు తప్పుకుండా పాటించాలని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మాస్కు లేకుండా పరీక్ష హాల్లోకి అనుమతించబోమని చెప్పింది. పరీక్ష కేంద్రాల వద్ద శానిటైజర్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. ఎవరికైనా జలుబు, జ్వరం ఉంటే వారు పరీక్ష కేంద్రం ఇన్‎ఛార్జీకి సమాచారం ఇవ్వాలని అధికారులు తెలిపారు. 2020-21 విద్యాసంవత్సరంలో ఇంటర్‌ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు.. ప్రస్తుతం ద్వితీయ సంవత్సరం చదువుతున్నారు. గత మార్చిలో కరోనా కారణంగా పరీక్షలు లేకుండానే వారంతా ప్రమోట్‌ అయ్యారు. ప్రస్తుతం పరిస్థితులు మారడంతో మొదటి సంవత్సరానికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఇంటర్‌ బోర్డు గతంలోనే స్పష్టం చేసింది. తొలుత ప్రకటించిన విధంగా 70 శాతం సిలబస్​కే పరీక్షలు నిర్వహించనున్నారు.

అక్టోబర్ 25 సెకండ్ లాగ్వేజ్-1, 26న ఇంగ్లీష్ పేపర్-1, 27న మాథ్య్-1, బాట్ని-1, పొలిటికల్ సైన్స్-1, 28న మాథ్య్-1, జూవాలజీ-1, హస్టరీ-1, నవంబర్ 1న కెమిస్ట్రీ-1, కామర్స్-1, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్-1, బ్రిడ్జ్ కోర్సు మ్యాథ్స్ పేపర్-1, 2న మోడర్న్ లాగ్వేజ్ పేపర్-1, జియోగ్రాఫిక్ పేపర్-1, 31న ఫిజిక్స్-1, ఎకానమిక్స్-1 పరీక్ష నిర్వహించనున్నారు.

Read Also.. Covid-19 Vaccine: ఆదివారం వ్యాక్సిన్ వేయించుకుంటే లక్కీ డ్రా.. వాషింగ్ మెషీన్స్, గ్రైండర్లు బహుమతి.. ఎక్కడంటే