Khazana Jewellery Robbery: చందానగర్ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. బీదర్ దొంగల పనేనా?
సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ అంతర్రాష్ట్ర ముఠాలు నగర వ్యాప్తంగా స్వైరవిహారం చేశాయి. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాప్‌లో దొంగలు తుపాకులతో కాల్పులు జరిపి భారీ లూటీకి పాల్పడ్డారు. అటు కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో కూడా వృద్ధ దంపతులను..

హైదరాబాద్, ఆగస్టు 13: పట్టపగలు హైదరాబాద్ మహా నగరంలో దొంగలు దోపిడీకి యత్నించారు. వేర్వేరు చోట్ల దోపిడీకి పాల్పడ్డారు. సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకూ అంతర్రాష్ట్ర ముఠాలు నగర వ్యాప్తంగా స్వైరవిహారం చేశాయి. హైదరాబాద్ నగరంలోని చందానగర్‌లోని ఖజానా జ్యువెలరీ షాప్‌లో దొంగలు తుపాకులతో కాల్పులు జరిపి భారీ లూటీకి పాల్పడ్డారు. అటు కేపీహెచ్‌బీ కాలనీలోని 7వ ఫేజ్‌లో కూడా వృద్ధ దంపతులను బంధించి పెద్ద ఎత్తున సొత్తు దోచుకెళ్లారు. ఒకే రోజు దోపిడీకి పాల్పడిన ఈ రెండు ముఠాలకు సంబంధం ఉందని, వీరు ఒకే ముఠాకు చెందిన వారై ఉంటారని స్థానికుల భావిస్తున్నారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు మాత్రం ఈ రెండు ఘటనలు జరిగిన తీరును బట్టి.. వేర్వేరు ముఠాలకు చెందిన వారు ఈ దోపిడీలు చేసి ఉంటారని భావిస్తున్నారు.
చందానగర్ ఖజానా జ్యువెలరీ దుకాణంలో మంగళవారం (ఆగస్ట్ 12) ఉదయం దుండగులు చొరబడ్డారు. అనంతరం ఖజానా జ్యువెలరీ దుకాణంలో లాకర్ తాళంచెవి ఇవ్వాలని తుపాకీతో సిబ్బందిని బెదిరించారు. అందుకు వారు నిరాకరించడంతో కాల్పులు జరిపారు. దీంతో డిప్యూటీ మేనేజర్ కాలికి గాయమై తీవ్ర రక్త స్రావం అయింది. షాప్ లోపల స్టాల్స్ విరగ్గొట్టి సిబ్బందిపై దాడి చేశారు. భయాందోళనలకు గురైన సిబ్బంది వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటీన పోలీసులను అక్కడికి రావడంతో.. వారిని చూసి దొంగలు పరారయ్యారు.
హైదరాబాద్ – చందానగర్ ఖజానా జువెలర్స్‌లో గన్ ఫైర్
పట్టపగలే ఖజానా జువెలర్స్‌లో చొరబడిన ఆరుగురు దుండగులు
గన్‌తో బెదిరించి లాకర్ కీస్ అడిగిన గ్యాంగ్.. ఇవ్వకపోవడంతో అసిస్టెంట్ మేనేజర్ కాలుపై కాల్పులు
సీసీ కెమెరాలపై ఫైర్ చేసి, బంగారు ఆభరణాలకు సంబంధించిన స్టాల్స్ పగలగొట్టిన దుండగులు… https://t.co/gszcvvSxDw pic.twitter.com/TVji4PwYrn
— Telugu Scribe (@TeluguScribe) August 12, 2025
నిందితుల కోసం పది పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. మొత్తం ఆరుగురు దుండగులు రెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. తుపాకులతో సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. దుండగులు జహీరాబాద్ వైపు పారిపోయినట్లు తెలియడంతో జిల్లాల సరిహద్దుల వద్ద పోలీసులను అలెర్ట్ చేశారు. స్థానిక సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
చందానగర్ ఖజానా కాల్పుల ఘటన కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. నిందితులు బీదర్ వైపు పరారైనట్లు పోలీసులు గుర్తించారు. చోరీ కంటే ముందుగానే 9 గంటల 30 నిమిషాల ప్రాంతంలో నిందితులు రెక్కీ నిర్వహించినట్లు వెల్లడైంది. నిందితుల కోసం పది బృందాలుగా పోలీసుల గాలిస్తున్నారు.రెండు బైక్స్ మీద వచ్చి ఆరుగురు నిందితులు చోరీకి పాల్పడ్డారు. సుమారు 10 కిలోల వెండితో పాటు వన్ గ్రామ్ గోల్డ్ నిందితులు చోరీ చేశారు. ఇప్పటివరకు సైబరాబాద్ పోలీసులు సుమారు 100 సిసి కెమెరాలను పరిశీలించారు. బీదర్ వైపు నిందితులను పట్టుకునేందుకు సైబరాబాద్ పోలీస్ టీం వెళ్లింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.




