AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వేదపండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలు

తెలుగు సంవత్సరాదినాడు ప్రతి జిల్లాలో ఐదుగురు వేదపండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌ కేవీ రమణాచారి హామీ ఇచ్చారు. రెండేళ్లుగా ఈ పురస్కారాలు అందడంలేదని, ఈ ఉగాది నుంచి ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయంలో పంచాగ శ్రవణం నిర్వహించి, పురస్కారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏప్రిల్‌ 1న దేవాదాయశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు […]

వేదపండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 29, 2019 | 7:59 PM

Share

తెలుగు సంవత్సరాదినాడు ప్రతి జిల్లాలో ఐదుగురు వేదపండితులు, అర్చకులకు ఉగాది పురస్కారాలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు చైర్మన్‌ కేవీ రమణాచారి హామీ ఇచ్చారు. రెండేళ్లుగా ఈ పురస్కారాలు అందడంలేదని, ఈ ఉగాది నుంచి ప్రతి జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆలయంలో పంచాగ శ్రవణం నిర్వహించి, పురస్కారాలు అందించేలా చర్యలు తీసుకోవాలని బ్రాహ్మణ సేవా సమితి సభ్యులు విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏప్రిల్‌ 1న దేవాదాయశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై తగు ఆదేశాలు జారీ చేస్తామని స్పష్టం చేశారు. రమణాచారిని కలిసినవారిలో బ్రాహ్మణ సేవా సమితి గౌరవ అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ, భాస్కరభట్ల రామశర్మ, గట్టు శ్రీనివాసాచారి తదితరులు ఉన్నారు.

Follow Us