Hyderabad: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వాన.. హైదరాబాద్‌లోని విద్యాసంస్థలకు సెలవు..
Hyderabad Heavy Rains: విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లుగా తెలిపింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సెలవు ప్రకటన వర్తిస్తుందని తెలిపింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌స్తభాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
వర్ష బీభత్సం కొనసాగుతోంది. హైదరాబాద్‌లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. భారీ వర్షాల కారణంగా సెలవు ప్రకటిస్తున్నట్లుగా తెలిపింది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ సెలవు ప్రకటన వర్తిస్తుందని తెలిపింది. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు విరిగిపడ్డ చెట్లు, విద్యుత్‌స్తభాలు నెలకొరిగాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. అవసరమైతేనే బయటకు రావాలని జీహెచ్ఎంసీ సూచించింది. కుండపోత వర్షంతో హైదరాబాద్ అల్లాడింది. వాన హోరుతో విలవిల్లాడింది. భారీ వర్షంతో నగరం నిలువెల్లా వణికింది. ఉదయం 4 గంటల 15 నిమిషాలకు మొదలైన వాన కంటిన్యూగా పడుతూనే ఉంది. భారీ వానతో నగర రోడ్లన్నీ జలమయం అయ్యాయి.
ప్రధాన రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. హైదరాబాద్‌లో తెల్లవారుజాము నుంచి ఎడతెరపి లేకుండా వాన పడుతూనే ఉంది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు. రోడ్లపై నీరు నిలువకుండా చర్యలు తీసుకున్నారు. వచ్చిన నీరు వచ్చినట్లే వెళ్లేలా చూస్తున్నారు.
నగరంలోని మెహిదీపట్నం, టోలీచౌకి, షేక్‌పేట్, గచ్చిబౌలిలో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, రాజేంద్రనగర్, మలక్‌పేట, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, ఉప్పల్, తార్నాక, సికింద్రాబాద్, హకింపేట్, బొల్లారం, అల్వాల్, చింతల్, కుత్బుల్లాపూర్, గాజులరామారం, జీడిమెట్లతో పాటు నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం పడింది.
అత్యధికంగా మియాపూర్‌లో 14 సెం.మీ వర్షం కురిసింది. హైదర్‌నగర్‌లో 12.7 సెంటీమీటర్లు వర్షం నమోదైంది. హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి.
తలసాని సమీక్ష..
భారీ వర్షాలపై అధికారులతో మంత్రి తలసాని శ్రీనివాస్ సమీక్ష చేపట్టారు. అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రోడ్లపై నీరు నిలిచిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, అటు ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని ఆదేశించారు మంత్రి తలసాని.
మరో ఐదు గంటల పాటు భారీ వర్షం..
హైదరాబాద్ నగర వాసులకు జీహెచ్‌ఎంసీ అలర్ట్ జారీ చేసింది. మరో ఐదు గంటల పాటు భారీ వర్షం పడే అవకాశముందని హెచ్చరించింది. హైదరాబాద్‌కు రెడ్‌అలర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ..ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచించింది. మరోవైపు సహాయక చర్యలు చేపడుతున్నాయి DRF బృందాలు.
ఐఎండీ రిపోర్ట్ ఇక్కడ చూడండి..
— IMD_Metcentrehyd (@metcentrehyd) September 5, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసం