CM KCR: ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటనతో రైతుల హర్షం.. ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం...

CM KCR: ధాన్యం కొనుగోలుపై సీఎం ప్రకటనతో రైతుల హర్షం.. ఢిల్లీ తెలంగాణ భవన్ లో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Kcr
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 13, 2022 | 1:21 PM

యాసంగి వరి ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్న సీఎం కేసీఆర్(CM KCR) ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిల్లీలోని తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మంగళవారం జరిగిన కేబినెట్‌(Telangana Cabinet) సమావేశంలో వరిని ప్రభుత్వమే కొంటుందని ముఖ్యమంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో యాసంగి సీజన్‌లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వివరించారు. క్వింటాల్‌ ధాన్యానికి రూ.1,960 చొప్పున కొంటామన్నారు. రైతులు తక్కువ ధరకు వడ్లు అమ్ముకోవద్దని సూచించారు. కేంద్రం దుర్మార్గ వైఖరి ప్రదర్శిస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఖజానా పై పడే అధిక భారాన్ని భరిస్తూ, చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఅర పేర్కొన్నారు. యాసంగి వడ్లను కొనేందుకు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో కమిటీ వేయనున్నట్లు తెలిపారు. ఈ కమిటీ.. జిల్లా కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లు, పంపిణీ వ్యవహారాలను పర్యవేక్షించాలని అన్నారు.

సీఎం కేసీఆర్ ప్రకటనతో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌ కుమార్‌ టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టరేట్‌లలో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలని సూచించారు. తమ జిల్లాలో ఎక్కడైనా ధాన్యం కొనుగోలులో ఏ విధమైన సమస్యలు ఎదురైనా వెంటనే పరిష్కరించాలన్నారు. పొరుగు రాష్ట్రాల నుంచి ధాన్యం రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Also Read

Viral Photo: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫోటోలో ఎన్ని ముఖాలు దాగున్నాయో కనిపెట్టగలరా? 99 శాతం ఫెయిల్!

Vemula Prashanth: “రైతులను కడుపులో పెట్టుకుని చూసుకునేది కేసీఆర్ మాత్రమే”.. మరోసారి రుజువైందన్న మంత్రి

Health Tips: మీ కళ్లలో ఈ మార్పులు కనిపిస్తే.. ఈ 6 వ్యాధుల బారిన పడినట్లే.. అవేంటో తెలుసా?