హైదరాబాద్‌లో గంటకు పైగా కుండపోత వర్షం.. మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు..!
హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు.
హైదరాబాద్ మహానగరంలో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ఆదేశాలు జారీ చేశారు. తక్కువ సమయంలో ఎక్కువ వర్షం పడడంతో నాళాల వద్ద వరద ప్రవాహం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. మాన్ హోల్స్ వద్ద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ హెచ్చరికలతో హైదరాబాద్ మహానగరంలో వచ్చే రెండు గంటల పాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, వాటర్ వర్క్స్, విద్యుత్ ,పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు , ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు కురిస్తే లోతట్టు ప్రాంతాల్లో ,ముంపు ప్రాంతాల్లో ఇబ్బందులు లేకుండా ఉండడంతో పాటు , ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులను అలర్ట్ చేశారు. హైదరాబాద్ లో భారీ వర్షం కురిసినప్పుడు నీళ్ళు నిల్వ ఉండే 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద జీహెచ్ఎంసీ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు. ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి నీళ్ళు వెంటనే వెళ్ళేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఎక్కడైతే వర్షం కురిసి ఇబ్బందులు ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో అధికారులకు ప్రజలు ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్య తీవ్రమైతే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అధిక వర్షపాతం ఉన్న ప్రదేశాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇక్కడ జీహెచ్ఎంసి బృందాలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..