Hyderabad: నగరంలో కారు బీభత్సం.. 180 కిలోమీటర్ల స్పీడ్‌తో దుకాణాన్ని ఢీకొట్టిన యువకులు.. హడలిపోయిన వాకర్స్

అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. ఆపై 180 కిలోమీటర్ల స్పీడ్‌.. ఇంకేముంది. ఓవర్‌ స్పీడ్‌తో రోడ్డుపై వెళ్తున్న వారిని హడలెత్తించారు. చివరకు వారే ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో బీభత్సం సృష్టించారు ముగ్గురు యువకులు.

Hyderabad: నగరంలో కారు బీభత్సం.. 180 కిలోమీటర్ల స్పీడ్‌తో దుకాణాన్ని ఢీకొట్టిన యువకులు.. హడలిపోయిన వాకర్స్
Accident
Follow us
Basha Shek

|

Updated on: Feb 07, 2023 | 9:59 AM

అర్థరాత్రి వరకు ఫుల్లుగా తాగారు. ఆపై 180 కిలోమీటర్ల స్పీడ్‌.. ఇంకేముంది. ఓవర్‌ స్పీడ్‌తో రోడ్డుపై వెళ్తున్న వారిని హడలెత్తించారు. చివరకు వారే ప్రమాదానికి గురయ్యారు. మద్యం మత్తులో హైదరాబాద్‌ వనస్థలిపురంలోని ఎన్‌జీవోస్‌ కాలనీలో బీభత్సం సృష్టించారు ముగ్గురు యువకులు. రాత్రంతా పార్టీ చేసుకున్నారు. ఫుల్లుగా మందుకొట్టి తెల్లవారుజామున స్టీరింగ్‌ పట్టి రోడ్డెక్కారు. నిషా నెత్తికెక్కి జెట్‌ స్పీడ్‌తో దూసుకెళ్లారు. 180 కిలోమీటర్ల వేగంతో..రోడ్డుపై వెళ్తున్న వారిని బెంబేలెత్తించారు. కట్‌ చేస్తే.. స్థానికంగా ఉన్న షాపులను ఢీ కొట్టారు. ఓవర్‌ స్పీడ్‌తో ఢీ కొట్టడంతో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో, బయటా ఉన్న రక్తపు మరకలు చూస్తే.. కారులో ఉన్న వారికి తీవ్రగాయాలైనట్టుగా తెలుస్తోంది. ఐతే వాకర్స్‌కు మాత్రం తృటిలో పెను ప్రమాదం తప్పిందనే చెప్పాలి. తీవ్ర గాయాలతో అందులోనుంచి దిగిన యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు చెబుతున్నారు స్థానికులు.

ప్రమాదం జరిగిన సమయంలో 180 స్పీడ్‌లో వెళ్లినట్టు గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో కారులో ఉన్నవారికి కూడా గాయాలయ్యాయి. ఐతే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేలోపే ఆ ముగ్గురు యువకులు వెళ్లిపోయారు. దీంతో వారు ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారో ఆరా తీస్తున్నారు పోలీసులు. అలాగే ఈ ఘటనకు సంబంథించి పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..

నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో ఆ స్టార్ హీరోయిన్..
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
సెంచరీతో అదరగొట్టిన నితీష్ రెడ్డి.. సీఎం చంద్రబాబు అభినందనలు
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
గొప్ప నివాళి అర్పించిన మన్మోహన్ సింగ్ స్వగ్రామం!
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఆ హీరోల నుంచి డబల్ ధమాకా.. 2025లో ఫ్యాన్స్‎ని ఖుషి చేయనున్నారా.?
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట
ఓటీటీలోకి వచ్చేసిన జబర్దస్థ్ రాకేష్ కేసీఆర్.. స్ట్రీమింగ్ ఎక్కడంట