AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: బీఆర్ఎస్ నేతల ఫోన్లు ‘హ్యాక్’..! పీఎస్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు..

ఎన్నికలు పూర్తయ్యాయి..ఇక అంతా ప్రశాంతమే అనుకుంటుండగా..గెలిచిన అభ్యర్థులకు కొత్త థ్రెట్‌ మొదలైంది. స్పూఫ్‌ కాల్స్‌తో ప్రజా ప్రతినిధులను కొంతమంది అగంతకులు చంపేస్తామని బెదిరిస్తున్నారట. రాచకొండ పీఎస్‌ పరిథిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది.

BRS:  బీఆర్ఎస్ నేతల ఫోన్లు 'హ్యాక్'..! పీఎస్‌కు వెల్లువెత్తిన ఫిర్యాదులు..
Brs Party
Ravi Kiran
|

Updated on: Dec 08, 2023 | 7:30 PM

Share

ఎన్నికలు పూర్తయ్యాయి..ఇక అంతా ప్రశాంతమే అనుకుంటుండగా..గెలిచిన అభ్యర్థులకు కొత్త థ్రెట్‌ మొదలైంది. స్పూఫ్‌ కాల్స్‌తో ప్రజా ప్రతినిధులను కొంతమంది అగంతకులు చంపేస్తామని బెదిరిస్తున్నారట. రాచకొండ పీఎస్‌ పరిథిలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మల్కాజిగిరి బీఆర్ఎస్ ముఖ్య నేతలు, కార్పొరేటర్లకు గత రెండు రోజులుగా బెదిరింపు ఫోన్ కాల్స్ రావడం కలకలం రేపుతోంది. మల్కాజిగిరి MLA మర్రి రాజశేఖర్ రెడ్డి మొబైల్ ఫోన్ నెంబర్‌తో కాల్స్ రావడంతో బాధితులు ఆశ్చర్యపోయారు. టెక్నాలజీ ఉపయోగించి MLA పేరుతో కాల్స్ చేసి బెదిరింపులకు పాల్పడినట్టు మల్కాజిగిరి, నేరెడ్మెట్, అల్వాల్ పోలీస్ స్టేషన్‌లలో పలువురు BRS నేతలు ఫిర్యాదులు చేశారు. అల్వాల్ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్‌రెడ్డి, నేరెడ్‌మెట్ కార్పొరేటర్ భర్త ఉపేందర్‌ రెడ్డి, గౌతమ్‌నగర్ కార్పొరేటర్ భర్త రాము యాదవ్, మల్కాజిగిరి మాజీ కార్పొరేటర్ జగదీష్‌గౌడ్, పలువురు BRS నేతలకు బెదిరింపు కాల్స్‌ వచ్చాయి. వీరంతా స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అటు మల్కాజ్‌గిరి BRS MLA మర్రి రాజశేఖర్‌రెడ్డి కూడా ఈ వ్యవహారంపై రాచకొండ సీపీ డి.ఎస్‌.చౌహాన్‌కు ఫిర్యాదు చేశారు. ఫోన్‌ చేసి బెదిరించిన అగంతకులపై చర్యలు తీసుకోవాలని కోరారు. మర్రి రాజశేఖర్‌రెడ్డి గెలుపును జీర్ణించుకోలేక అపోజిషన్‌ వాళ్లే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ ఆరోపిస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్‌గిరి నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి గెలుపొందగా, కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి హన్మంతరావు ఓటమి పాలయ్యారు.

ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
పసిడి ప్రియులకు దిమ్మతిరిగే షాక్ రికార్డ్ స్థాయికి బంగారం, వెండి
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
మేడారం జాతరకు వెళ్లేవారికి శుభవార్త.. ఆర్టీసీ బిగ్ అప్డేట్
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
ప్రేమలో పడ్డారా? పెళ్లి వార్తలపై క్లారిటీ ఇచ్చిన మృణాల్!
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
తెలంగాణలోని రైతులకు తీపికబురు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త పథకం
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..
మేడారం జాతరలో టాలీవుడ్ హీరోయిన్..