AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BRS: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం.. ఫ్లోర్ లీడర్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్.!

బీఆర్‌ఎస్.. ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. రాష్ట్రాన్నే సాధించిన పార్టీ.. సుమారు పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్వజయంగా పాలించిన పార్టీ.. ఇప్పుడు ఎల్పీ లీడర్‌ని ఎన్నుకోవడానికి తర్జనభర్జన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎవరు ఉంటారు.

BRS: ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కీలక సమావేశం.. ఫ్లోర్ లీడర్‌పై కొనసాగుతోన్న సస్పెన్స్.!
Ravi Kiran
| Edited By: |

Updated on: Dec 09, 2023 | 6:18 AM

Share

బీఆర్‌ఎస్.. ఉద్యమంలో నుంచి పుట్టిన పార్టీ. రాష్ట్రాన్నే సాధించిన పార్టీ.. సుమారు పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని దిగ్వజయంగా పాలించిన పార్టీ.. ఇప్పుడు ఎల్పీ లీడర్‌ని ఎన్నుకోవడానికి తర్జనభర్జన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా ఎవరు ఉంటారు. అసెంబ్లీలో అధికార పక్షాన్ని ఎవరు ఎదుర్కుంటారనే చర్చ మొదలైంది. 39 సీట్లు గెలిచిన బీఆర్‌ఎస్సే తెలంగాణ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ. కానీ ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ బాధ్యతలు ఎవరు తీసుకుంటారనేదే సస్పెన్స్‌గా మారింది.

పార్టీ అధినేతగా ఉన్న కేసీఆరే.. ఫ్లోర్ లీడర్ బాధ్యతలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ అనుకోకుండా ఆయన అనారోగ్యం పాలవడం.. వయసు ఎక్కువగా ఉండటంతో.. ఆయన ఫ్లోర్ లీడర్‌గా ఉండే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆయన లేకపోతే పార్టీలో నెక్ట్స్ ఎవరనే చర్చ జరుగుతోంది. ఈ రేసులో ప్రధానంగా కేటీఆర్ పేరు వినిపిస్తుంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్.. మొన్నటిదాకా కీలక శాఖలకు మంత్రిగా పనిచేసిన కేటీఆర్ అయితేనే ప్రభుత్వానికి ధీటుగా సమాధానం ఇవ్వగలరని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. పైగా పార్టీలో చాలా మంది నేతలు కేటీఆర్ అయితేనే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారు. పైగా అన్ని అంశాలపై అగ్రెసివ్‌గా మాట్లాడే నైపుణ్యం, రాజకీయాల్లో దూసుకుపోయే మనస్తత్వం ఉన్న నేత కేటీఆర్. కాబట్టి ఆయనవైపే పార్టీ మొగ్గు చూపుతోంది.

ఇక పార్టీలో సీనియర్‌కి అవకాశం ఇవ్వాలనుకుంటే ఆ రేసులో కడియం శ్రీహరి పేరు వినిపిస్తోంది. కానీ కడియం శ్రీహరికి ఎల్పీ పదవి ఇస్తే కొన్ని విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించిన వాళ్లు అధికారం పోయాక పక్కన ఉన్నారనే ఆరోపణలు వస్తాయి. కాబట్టి కడియంకు ఇవ్వాలా వద్దా అనే ఆలోచనలో పార్టీ ఉంది. ఇక ఈ రేసులో ప్రధానంగా వినిపిస్తున్న మరోపేరు హరీష్‌రావు. మాస్ లీడర్‌గా పేరున్న హరీష్‌రావును శాసనసభాపక్ష నేతగా నియమిస్తే బాగుంటుందనే చర్చ కూడా నడుస్తోంది. ఏది ఏమైనా పార్టీ నిర్ణయమే ఫైనల్. రేపు ఉదయం 9 గంటలకు జరిగే ఎల్పీ మీటింగ్‌లో దీనిపై పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. సో.. బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేత ఎవరనేదానిపై రేపే స్పష్టత రానుంది.