చపాతీల్లోకి అదిరి పోయే డిష్.. ఎగ్ కీమా ఇలా చేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే!

Samatha

12 February 2026

చాలా మందికి మటన్ కీమానే చాలా ఎక్కువగా తెలుసు. కానీ ఎగ్ కీమా కూడా  అద్భుతంగా ఉంటుందంట. కాగా ఇప్పుడు మనం ఉడికించిన గుడ్లతో చేసే ఎగ్ కీమా ఎలా చేయాలో చూద్దాం.

మటన్ కీమా

ముఖ్యంగా ఈ ఎగ్ కీమా అనేది చపాతీ, పూరీ, అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. మరి. మరి ఇంకెందుకు ఆలస్యం దీనిని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం.

ఎగ్ కీమా

ముందుగా ఆరు ఎగ్స్ ఉడకబెట్టి, తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎగ్స్ మంచిగా ఉడికేలా చూసుకోవాలి.

ఎగ్స్ ఉడకబెట్టడం

తర్వాత స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో లవంగాలు, అల్లం, జీలకర్ర వేసి, వేయించాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

ఉల్లిపాయలు వేయించడం

దీని తర్వాత పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.  తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయిస్తూనే ఉండాలి.

పచ్చి వాసన

 తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఒక టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. ఇందులోనే కొంచెం నీళ్లు పోసి, ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, మసాలా వేసి మంచిగా ఉడికేలా చూడాలి.

టమాటాలు

చివరగా మనం ఉడకబెట్టి, చిన్నగా తరిగిన ఎగ్స్ అందులో వేసి మెల్లగా కలుపుతూ ఉండాలి.  చివరగా కొత్తిమీర, పూదీనా వేసి గ్యాస్ పై 5 నిమిషాలు ఉంచి, స్టవ్ ఆఫ్ చేయండి.

కొత్తిమీర, పూదీన

అంతే టేస్టీ టేస్టీ ఎగ్ కీమా రెడీ, ఇది  చపాతీ, పూరీల్లో సైడ్ డిష్‌గా అదిరిపోతుంది. అంతే కాకుండా, చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకు ప్రతి ఒక్కరూ చాలా ఇష్టంగా తింటారు.

ఎగ్ కీమా