Ganesh Laddu: ద్యావుడా.. గణేష్ మండపాల్లో లడ్డూలను అందుకే దొంగిలిస్తున్నారా..? చోరీ వెనుక అంత పెద్ద కథ ఉందా..

హైదరాబాద్ గణపతులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత, గణేశుడి చేతిలో పెట్టే లడ్డూను కాపాడుకోవడం నిర్వాహకులకు పెద్ద సవాల్‌గా మారింది. ఆ లడ్డూలకు సెక్యూరిటీ పెట్టే పరిస్థితి వచ్చింది. రాత్రిళ్లు గణేష్‌ మండపాల్లో వంతులవారీగా కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. వినాయకుడి లడ్డూలను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు.

Ganesh Laddu: ద్యావుడా.. గణేష్ మండపాల్లో లడ్డూలను అందుకే దొంగిలిస్తున్నారా..? చోరీ వెనుక అంత పెద్ద కథ ఉందా..
Ganesh Laddoo
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Sep 10, 2024 | 8:03 PM

హైదరాబాద్ గణపతులకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. విగ్రహ ప్రతిష్టాపన తర్వాత, గణేశుడి చేతిలో పెట్టే లడ్డూను కాపాడుకోవడం నిర్వాహకులకు పెద్ద సవాల్‌గా మారింది. ఆ లడ్డూలకు సెక్యూరిటీ పెట్టే పరిస్థితి వచ్చింది. రాత్రిళ్లు గణేష్‌ మండపాల్లో వంతులవారీగా కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. వినాయకుడి లడ్డూలను కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు. అసలు ఈ విచిత్ర పరిస్థితి ఎందుకు వచ్చింది. లోకాలను కాపాడే వినాయకుడి లడ్డూలను కాపాడేదెలా? లడ్డూలను మాత్రమే దొంగిలించే ఆ వింత దొంగలు ఎవరు?.. అనేది ప్రశ్నార్థకంగా మారింది.. వినాయక చవితి ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే హైదరాబాద్‌లోని గణేష్‌ మండపాల్లో నాలుగు లడ్డూలు మాయమయ్యాయి. నగరంలోని నిజాంపేట ప్రాంతంలో రెండు, ప్రగతి నగర్‌లో ఒక లడ్డు, కీసర పరిధిలో ఒక వినాయకుడి లడ్డూను దొంగలు ఎత్తుకువెళ్లారు. ప్రగతి నగర్ లోని ఒక అపార్ట్‌మెంట్‌లో గణేష్‌ లడ్డూని రాకేష్ అనే వ్యక్తి వేలం పాటలో 37 వేల రూపాయలకు దక్కించుకున్నాడు. వినాయకుడిని కదిలించిన తరువాత పాట పాడిన వ్యక్తికి లడ్డూ ఇవ్వాల్సి ఉంది. కానీ ఆ లడ్డూను, అంతకుముందు రాత్రే దొంగలు ఎత్తుకెళ్లారు. దీంతో వేలం పాటలో లడ్డు దక్కించుకున్న వ్యక్తి లబో దిబోమంటున్నాడు.

ఆ నమ్మకంతోనేనా..?

ఈ దొంగతనాలు ఎవరైనా ప్రొఫెషనల్ దొంగలు చేస్తున్నారా అంటే అదీ కాదు. కేవలం లడ్డూ దొంగతనం చేసి తింటే మంచి జరుగుతుందన్న నమ్మకమే జనాలను ఇలాంటి దొంగతనాలకు ప్రోత్సహిస్తోందని చెబుతున్నారు. ఈ గణేష్ లడ్డూ కోసం వేలం పాటలో లక్షలు పెట్టడానికి కూడా భక్తులు వెనుకాడడం లేదు. వాటిని పోటీ పడి మరీ దక్కించుకుంటారు. లడ్డును వేలంలో పాల్గొనకుండా పొందాలనే ఆలోచననో.. లేక గణేశుడి చేతిలో లడ్డూ దొంగతం చేసి తింటే సిరి సంపదలు కలుగుతాయని.. ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయనే మూఢ నమ్మకాలతోనే ఈ దొంగతనాలకు పాల్పడుతున్నారని చెబుతున్నారు.

గణేష్‌ లడ్డూలకు సెక్యూరిటీ..

దొంగల భయంతో గణేష్ మండపం వాళ్ళు రాత్రి లడ్డూను గణేష్ చేతిలో నుంచి తీసి ఇంట్లో దాచి మళ్ళీ ఉదయమే దాన్ని వినాయక విగ్రహం చేతిలో పెడుతున్నారు. కొన్నేళ్లుగా నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో కూడా గణేష్‌ లడ్డూల దొంగతనాలు జరుగుతున్నాయి. చాలా చోట్ల పోలీసులకు కంప్లయింట్‌ చేయకుండా విగ్రహం చేతిలో మరో లడ్డూ పెట్టి, దానికి కాపలా కాస్తున్నారు నిర్వాహకులు. గతేడాది 8 లడ్డూలను ఎత్తుకెళ్లినట్టు ఫిర్యాదులు వచ్చాయి. కొన్ని మండపాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో లడ్డూ దొంగలు ఎవరో తెలుసుకున్నారు. కానీ, కేసులు నమోదు చేయలేదు. గణేష్‌ లడ్డూల దొంగతనాల భయంతో…మండపాల నిర్వాహకులు రాత్రంతా వంతులు వేసుకుని మరీ కాపలా ఉంటున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..