AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బరితెగించిన లోన్యాప్ నిర్వాహకులు.. భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపారు.. పాపం చివరకు..

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.. డబ్బు అవసరం ఏర్పడింది.. తెలిసి చేశాడో.. తెలియక చేశాడో తెలియదు కానీ, లోన్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని.. రుణం తీసుకున్నాడు.. భార్యకు అనుమానం రాకుండా నెలనెల చెల్లిస్తున్నాడు.. అంతా చెల్లించినా కానీ.. లోన్ యాప్ నిర్వాహకులు వినియోగదారులను పీల్చిపిప్పి చేస్తున్నాయి.. అధిక వడ్డీలు వసూలు చేస్తూ జనాల రక్తం తాగుతున్నారు.

బరితెగించిన లోన్యాప్ నిర్వాహకులు.. భార్య ఫొటోను మార్ఫింగ్ చేసి స్నేహితులకు పంపారు.. పాపం చివరకు..
Loan App Harassment
Shaik Madar Saheb
|

Updated on: Sep 10, 2024 | 5:56 PM

Share

ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే.. డబ్బు అవసరం ఏర్పడింది.. తెలిసి చేశాడో.. తెలియక చేశాడో తెలియదు కానీ, లోన్ యాప్ ను డౌన్‌లోడ్ చేసుకుని.. రుణం తీసుకున్నాడు.. భార్యకు అనుమానం రాకుండా నెలనెల చెల్లిస్తున్నాడు.. అంతా చెల్లించినా కానీ.. లోన్ యాప్ నిర్వాహకులు వినియోగదారులను పీల్చిపిప్పి చేస్తున్నాయి.. అధిక వడ్డీలు వసూలు చేస్తూ జనాల రక్తం తాగుతున్నారు. ఇలా లోన్​ యాప్​ల నిర్వాహకుల ఆగడాలు రోజురోజుకూ పెచ్చుమీరిపోతున్నాయి. తాజాగా, మేడ్చల్‌ జిల్లా పేట్‌బషీరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. లోన్ యాప్‌ నిర్వాహకుల వేధింపులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పేట్​బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సీఐ కె.విజయవర్ధన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం నందిగామకు చెందిన ఎం.వినోద్ కుమార్ (34) బతుకు దెరువు కోసం సుచిత్ర కూడలి సమీపంలోని శ్రీరాంనగర్‌లో నివసిస్తున్నాడు.. వినోద్‌కు భార్య మంజుషా దేవి, ఇద్దరు పిల్లలున్నారు. అయితే.. వినోద్ బోయిన్‌పల్లిలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాడు. ఇటీవల తండ్రికి అనారోగ్యంగా ఉండటంతో రూ.4 లక్షల వరకు అప్పులు చేశాడు. ఈ క్రమంలోనే భార్య మంజుషా దేవికి తెలియకుండా ఆమె ఫోన్ తో లోన్ యాప్​లో రుణం తీసుకున్నాడు.. ఈ సందర్భంగా ఇద్దరు దిగిన ఫొటోను అప్‌లోడ్ చేశాడు. లోన్ తీసుకున్న తర్వాత క్రమం తప్పకుండా ఈఎంఐలు చెల్లిస్తూ భార్యకు అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ వస్తున్నాడు. అయితే.. లోన్ సకాలంలో చెల్లించకపోవటంతో లోన్​యాప్​ నుంచి ఒత్తిడి అధికమైంది.

అతను లోన్ కట్టకపోవడంతో భార్య ఫొటోను మార్ఫింగ్‌ చేసి వినోద్ స్నేహితులకు, బంధువులకు లోన్ యాప్ నిర్వాహకులు పంపారు. ఈ విషయం తెలుసుకున్న మంజుషా దేవి సోదరుడు 3వేల వరకు రుణాన్ని చెల్లించాడు. అయినా యాప్ నిర్వాహకులు తిరిగి డబ్బు చెల్లించాలని ఒత్తిడి చేస్తుండటంతో ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

ఆదివారం వినోద్‌ మంజూషా పెళ్లి రోజు, వినాయక చవితి పండుగ కూడా ఉండటంతో మంజుషా దేవి కార్మికనగర్​లోని సోదరుడి ఇంటికి వెళ్లింది. తాను కూడా వస్తానని చెప్పి రాకపోవడంతో భార్య ఆదివారం ఎంత ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో.. వెళ్లి చూడగా ఫ్యాన్​కు ఉరేసుకుని వేలాడుతూ కన్పించాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..