AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఏది పడితే అది షేర్ చేస్తే.. ఇక ‘కటకటాలే’..

ఇకపై శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా పోస్ట్ పెట్టిన వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తూ రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాస్ తెలిపారు. సోషల్ మీడియాలో ఏదైనా వీడియో మెసేజ్ వస్తే సమాచారం పూర్తిగా తెలుసుకోవాలని సూచించారు.

Telangana: ఏది పడితే అది షేర్ చేస్తే.. ఇక 'కటకటాలే'..
Task Force Police Warning
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Oct 24, 2024 | 1:14 PM

Share

దేశ విదేశాల్లో ఎక్కడి నుంచైనా మతకలహాలు సృష్టించే విధంగా మతాలను కించపరిచే విధంగా వీడియోలు మెసేజెస్ పోస్ట్ చేస్తున్న వ్యక్తుల్ని హైదరాబాద్ పోలీసులు గుర్తించారు. ఇకపై శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా పోస్ట్ పెట్టిన వారిపై ఉక్కుపాదంతో అణిచివేస్తూ రౌడీషీట్ కూడా ఓపెన్ చేస్తామని హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హెచ్చరించారు. ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన కొన్ని మార్ఫింగ్ వీడియోల వల్ల అనేక సమస్యలు తలెత్తాయని పోస్టులు చేసిన వ్యక్తులపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని వివరించారు.

సోషల్ మీడియాలో ఏదైనా వీడియో మెసేజ్ వస్తే సమాచారం పూర్తిగా తెలుసుకోవాలని పోలీసు అధికారులు ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇష్టానుసారంగా వీడియోస్ మెసేజెస్ ఫార్వర్డ్ చేసి శాంతి భద్రతలను భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తే చట్టం తన పని చేసుకుంటూ పోతుందని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ అంది శ్రీనివాస్ టీవీ9 ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు. సికింద్రాబాద్ ఘటన తర్వాత హైదరాబాద్ పాతబస్తీ రైన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్టేటస్ పెట్టిన వ్యక్తికి భాష రాదు, ఆందోళన చేసిన స్థానికులకు పూర్తి సమాచారం లేకపోవడంతో సమస్యలు తలెత్యాయని డీసీపీ వివరించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

'TET నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే'.. AIASTF డిమాండ్
'TET నుంచి టీచర్లకు మినహాయింపు ఇవ్వాల్సిందే'.. AIASTF డిమాండ్
ఇలా వండితే చికెన్ విషమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే
ఇలా వండితే చికెన్ విషమే.. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే పెద్ద ప్రమాదమే
రాత్రి నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష..ఉదయాన్నే తీసుకుంటే లాభాలు
రాత్రి నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష..ఉదయాన్నే తీసుకుంటే లాభాలు
పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్
పాక్ బౌలర్ కవ్వింపులకు విండీస్ వీరుడి గట్టి వార్నింగ్
చలికాలం చిలగడదుంప తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
చలికాలం చిలగడదుంప తింటే ఇన్ని లాభాలా? ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే
కేంద్రం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో ఉచిత న్యాయ సహాయ సేవ..
కేంద్రం కీలక నిర్ణయం.. వాట్సాప్‌లో ఉచిత న్యాయ సహాయ సేవ..
అందరు హీరోలంటే ఇషం.. ఆయన సినిమాను మళ్లీ మళ్లీ చూస్తా..
అందరు హీరోలంటే ఇషం.. ఆయన సినిమాను మళ్లీ మళ్లీ చూస్తా..
చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
చికెన్, మటన్ త్వరగా ఉడికించాలంటే.. ఈ చిట్కాలు ట్రై చేయండి..
అక్కడ స్టార్ లింక్ ఇంటర్నెట్ ఫ్రీ.. మస్క్ ఆఫర్ అదిరింది
అక్కడ స్టార్ లింక్ ఇంటర్నెట్ ఫ్రీ.. మస్క్ ఆఫర్ అదిరింది
ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్
ఐపీఎల్ చూడకండి.. ప్రజలకు బంగ్లా సర్కార్ షాకింగ్ ఆర్డర్