Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంలో నేడు షాకింగ్ పరిణామాలు, ముఠా బాగోతం..

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు రేపుతోన్న తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Telugu Academy: తెలుగు అకాడమీ నిధుల కుంభకోణంలో నేడు షాకింగ్ పరిణామాలు, ముఠా బాగోతం..
Telugu Academy
Follow us
Venkata Narayana

|

Updated on: Oct 06, 2021 | 2:24 PM

Telugu Academy funding scam: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనాలు రేపుతోన్న తెలుగు అకాడమీ నిధుల గోల్ మాల్ కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసుకు సంబంధించి చందానగర్‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధనను సీసీఎస్‌ పోలీసులు నేడు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు అకాడమీ స్కాంలో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది. ఈ రోజు ఒక్క రోజే సీసీఎస్‌ పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు.

ఈ కేసుకు సంబంధించి మూడు బ్యాంకుల నుంచి కోట్లు డ్రా చేసిన ముఠా.. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ వరకు స్కాంకు పాల్పడినట్టు సీసీఎస్ పోలీసులు గుర్తించారు. డిసెంబర్‌కల్లా అకాడమీకి చెందిన 324 కోట్లు కొట్టేయాలని స్కేచ్‌ వేసినట్లు తెలిపారు. కమీషన్లు ఎర చూపి బ్యాంక్ అకాడమీ సిబ్బందిని ముగ్గులోకి దింపినట్లు తెలిపారు.

వీరిలో A1 ముద్దాయిగా మస్తాన్ వలీ, A2సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు స్కాంక్‌లకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేశారని పోలీసులు తెలిపారు.

Read also: Bathukamma: తొమ్మిది రోజులు జరుపుకునే బతుకమ్మ వేడుకల్లో ఏ రోజు పూజకు ఎలాంటి ఫలం?