AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revanth Reddy: ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..

బనకచర్ల ప్రాజెక్ట్‌ను అడ్డుకునేందుకు మూడు విధాలుగా ముందుకు సాగుతామన్నారు సీఎం రేవంత్. ప్రధాని సహా కేంద్రమంత్రులను కలిసి దీనిపై అభ్యంతరాలు చెబుతామన్నారు. కిషన్‌రెడ్డి కూడా తమతో కలిసి రావాలన్నారు. నాడు కేసీఆర్, జగన్‌ కలిసి రాయలసీమక గోదావరి నీళ్లు తరలిస్తామన్నారని గుర్తు చేశారు.

Revanth Reddy: ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు..
Cm Revanth Reddy
Ravi Kiran
|

Updated on: Jun 19, 2025 | 7:53 AM

Share

తెలుగు రాష్ట్రాల మధ్య గోదావరి-బనకచర్ల ప్రాజెక్ట్ అంశం రాజకీయంగా హీట్ పుట్టిస్తోంది. ఈ ప్రాజెక్టుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న వైఖరిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే తేల్చి చెప్పారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలనే వినియోగిస్తామని ఏపీ నేతలు చెప్పడం విస్మయం కలిగిస్తోందన్నారు. తెలంగాణ ప్రయోజనాలను హరించేలా ఈ ప్రాజెక్టు రూపొందించబడిందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం త్రీపాయింట్‌ ఫార్ములాతో పోరాటం ప్రారంభించింది. గోదావరి జలాల్లో తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునేందుకు పొలిటికల్, లీగల్, టెక్నికల్‌ ఫైట్ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ దిశగా ఇప్పటికే రాష్ట్ర ఎంపీలతోఅఖిలపక్ష సమావేశం పెట్టి పొలిటకల్ ఫైట్‌ ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. ఆల్‌ పార్టీ మీటింగ్ ద్వారా అందర్నీ.. కలుపుకొని వెళ్లే ప్రయత్నం చేసింది. ఈ భేటీకి హాజరైన బీఆర్ఎస్‌, బీజేపీ, ఎంఐఎం ఎంపీలతో బలనకచర్ల అంశంపై ప్రభుత్వం ఎలా ముందుకెళ్లాలని సలహాలు కోరింది రాష్ట్ర ప్రభుత్వం. ఇవాళ ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం రేవంత్, ఉత్తమ్ భేటీ కానున్నారు.

బనకచర్ల ద్వారా తెలంగాణకు గోదావరి జలాల్లో తీవ్ర నష్టం జరుగుతుందని.. తమ అభ్యంతరాలు ఇప్పటికే కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని.. ఆషామాషీగా బకచర్లకు అనుమతులు రానివ్వమని సీఎం రేవంత్ అన్నారు. మరోవైపు గోదావరి- బనకచర్ల అరుసంధానంతో తెలంగాణకు నష్టం ఉండదని ఏపీ ప్రభుత్వం పదేపదే చెబుతోంది. అయితే గోదావరి బేసిన్‌లో మా ప్రాజెక్టులకు క్లియరెన్స్ ఇచ్చాక.. వరదజలాలు వాడుకోండని అంటున్నారు సీఎం రేవంత్. కృష్ణా జలాల్లో 500 టీఎంసీలు, గోదావరి జలాల్లో 968 టీఎంసీలకు ఏపీ NOC ఇస్తే బనకచర్లపై తాము ఎలాంటి అభ్యంతరం చెప్పమని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాద చేశారు. మరి రేవంత్ ప్రతిపాదనకు చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి