Telangana: డ్రగ్స్ రహిత తెలంగాణే లక్ష్యంగా.. నార్కోటిక్ పోలీసుల కీలక నిర్ణయం.. అదేంటంటే
డ్రగ్స్ రహిత రాష్ట్రం కోసం తెలంగాణ నార్కోటిక్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. ఒకవైపు డ్రగ్స్ పెడ్లర్ల ఆటకట్టిస్తూనే … మరోవైపు మత్తు బానిసల మత్తు వదిలిస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డి అడిక్షన్ సెంటర్లను యాక్టివ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రత్యేక బెడ్లు కేటాయించి .. స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు.
రాష్ట్రంలో మత్తు పదార్థాల నియంత్రణకు తెలంగాణ నార్కోటిక్ పోలీసులు మరో సరికొత్త ప్రణాళికను సిద్ధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 డిఅడిక్షన్ సెంటర్లను పూర్తిస్థాయిలో యాక్టివ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల డిఅడిక్షన్ సెంటర్లు మూతపడినట్లు నార్కోటిక్ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం పెరుగుతున్న మత్తు బానిసల సంఖ్య కారణంగా మళ్లీ వాటిని యాక్టివ్ మోడ్ లోకి తెచ్చేందుకు నార్కోటిక్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రజెంట్ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 డిఅడిక్షన్ సెంటర్లలో 11 కేంద్రాలలో బాధితులు చికిత్స పొందుతున్నారు. పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్ ప్రాంతాల్లో డి ఎడిషన్ సెంటర్లు ఉన్నప్పటికీ అవి పని చేయనట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు.
నార్కోటిక్ పోలీసుల అనాలసిస్ ప్రకారం ఇప్పటివరకు అత్యధికంగా హనుమకొండలో 92 మంది ఇన్ పేషెంట్లు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 15 మంది చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. హెల్పింగ్ హ్యాండ్ సోసైటీ పేరుతో రన్ అవుతున్న డి అడిషన్ సెంటర్‌లో గడచిన మూడు నెలల్లో 92 మంది ఇన్ పేషెంట్లుగా వచ్చారు. హైదరాబాద్ చివర్లలోను డి అడిక్షన్ సెంటర్లో ఉన్నాయి. అమంగల్, కొత్తూరు, మేడ్చల్ ప్రాంతాల్లో డ్రగ్స్ డిఅడిక్షన్ సెంటర్లు పనిచేస్తున్నాయి. ఈ మూడు కేంద్రాల్లో సుమారు 150 మంది .. గడిచిన మూడు నెలల్లో చేరినట్లు అధికారులు గుర్తించారు.
మరోవైపు ప్రభుత్వ ఆధీనంలో నడిచే ప్రభుత్వ హాస్పిటల్స్ లోను డ్రగ్స్ బానిసలకు ప్రత్యేక బెడ్లను కేటాయించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 ఆస్పత్రుల్లో 280 బెడ్ లను కేటాయించారు. సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో 15 బెడ్స్ , ఎర్రగడ్డ ఆస్పత్రిలో మరో 15, మిగతా అన్ని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్కోదాంట్లో 10 బెడ్ల చొప్పున డ్రగ్స్ బాధితుల కోసం కేటాయించారు. అంతేకాకుండా గ్రామాల్లో ఉన్న ఆశా వర్కర్లు, ANMలు, అంగన్వాడీ వర్కర్లు, పంచాయతీ ఆఫీసర్లు, వార్డ్ మెంబర్ల తో ద్వారా మత్తు బారిన పడుతున్న యువతను గుర్తించాలని నార్కోటిక్ పోలీసులు ఆదేశించారు. స్టార్టింగ్ స్టేజ్ లోనే గుర్తించి డి అడిక్షన్ సెంటర్లకు పంపిస్తే వారి భవిష్యత్తును కాపాడిన వారం అవుతామని నార్కోటిక్ డైరెక్టర్ సందీప్ శాండిల్య తెలిపారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..