Hyderabad: హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. మరో 7 రోజులు ఇదే పరిస్థితి..
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌లో భారీ వర్షం పడుతుండగా.. పంజాగుట్ట, నాంపల్లి, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.
హైదరాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారింది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడుతోంది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, ఖైరతాబాద్, లక్డీకాపూల్‌లో భారీ వర్షం పడుతుండగా.. పంజాగుట్ట, నాంపల్లి, అమీర్‌పేట, ఎస్ఆర్‌నగర్, యూసఫ్‌గూడ ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది. ఆఫీసులకు వెళ్లేందుకు ఉద్యోగులు, రోజువారీ పనులకు వెళ్లే ప్రజలు ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 7 రోజులపాటు వర్షాలు పడతాయని వాతావరణశాఖ చెప్పింది. అలాగే జీహెచ్‌ఎంసీలో మంగళవారం రోజంతా వర్షం ఉంటుందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం నుంచి నాన్‌స్టాప్‌గా కురుస్తున్న వానకి.. మరికొన్ని ప్రాంతాల్లోనూ రోడ్లపై నీరు నిలిచిపోయింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వచ్చే నాలుగైదు రోజులు భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తోంది. తెలంగాణని పలు జిల్లాలకు కూడా వర్ష సూచన ఉన్నా.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చినుకు జనాల్ని వణికిస్తోంది.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..
తవ్వకాల్లో బయటపడ్డ దుర్గమాత విగ్రహం

