Hyderabad: వేరే మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇన్‌స్పెక్టర్ రాజు సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ..

గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగించి.. అడ్డంగా బుక్కయిన ఇన్‌స్పెక్టర్ రాజుపై సస్పెండ్ వేటు పడింది. రాజును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.

Hyderabad: వేరే మహిళతో రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన ఇన్‌స్పెక్టర్ రాజు సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన సీపీ..
Inspector Raju Suspended

Updated on: Nov 27, 2022 | 9:01 AM

Inspector Raju Suspended: గుట్టుచప్పుడు కాకుండా వివాహేతర సంబంధం కొనసాగించి.. అడ్డంగా బుక్కయిన ఇన్‌స్పెక్టర్ రాజుపై సస్పెండ్ వేటు పడింది. రాజును సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ నగన పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. నవంబర్ 4న సీఐ రాజు వేరే మహిళతో.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన విషయం తెలిసిందే. ఈ ఘటన హైదరాబాద్ పోలీస్ శాఖలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌ కమిషనరేట్‌లో సౌత్‌జోన్‌ కంట్రోల్‌ రూమ్‌ ఇన్‌స్పెక్టర్‌గా రాజు పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో వేరే మహిళతో ఉన్న ఇన్‌స్పెక్టర్‌ను అతని భార్య నవంబర్ 4న రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అనంతరం.. ఇద్దరు పిల్లలతో కలిసి ఇన్‌స్పెక్టర్‌ భార్య తనకు న్యాయం చేయాలంటూ వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగింది. భర్తతోపాటు అతనితో ఉన్న మహిళపై చర్యలు తీసుకోవాలంటూ వనస్థలిపురం పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.

ఈ సమయంలో వేరే మహిళతో ఉండగా పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్స్ పట్ల కూడా సీఐ రాజు అసభ్య ప్రవర్తించాడు. దీంతో కానిస్టేబుల్స్ కూడా వనస్థలిపురంలో ఫిర్యాదు చేశారు.

ఈ ఘటన అనంతరం రాజును అరెస్ట్ చేసిన వనస్థలిపురం పోలీసులు.. కోర్డులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించారు. రాజు వ్యవహారంపై విచారణ జరిపిన సీపీ.. సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..