Telangana: తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు.. ఆ కేసులో దాఖలైన అన్ని పిటిషన్లు కొట్టివేత!
తెలంగాణలోని అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా టెండర్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పువెలువరించింది. కోడిగుడ్ల టెండర్‌లో నాణ్యత కోసం ప్రభుత్వం విధించిన షరతులను హైకోర్టు సమర్ధించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ అయ్యే కోడిగుడ్ల నాణ్యతను నిర్ధారించేందుకు షరతులు అవసరమన్న ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన కోర్టు టెండర్ ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది.

తెలంగాణలోని అంగన్వాడీలలో చదివే పిల్లలకు నాణ్యమైన, పౌష్ఠికమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతో అంగన్వాడీలకు కోడిగుడ్ల సరఫరా టెండర్లపై ప్రభుత్వం కొన్ని ఆంక్షలు విధించింది. అగ్‌మార్క్ రిప్లికా సీరియల్ నంబర్ కలిగిన వారే టెండర్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చూసించినట్టు తెలుస్తోంది.అయితే ఈ టెండర్లపై ప్రభుత్వం విధించిన ఆంక్షలను సవాల్ చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. అయితే ప్రభుత్వ ఆంక్షలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఇటీవల విచారణ చేపట్టింది.
టెండర్ షరతులను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు ఇరువైపు వాదనలు విన్న తర్వాత ఆ పిటిషన్లను కొట్టివేస్తూ కీలక తీర్పును వెలువరించింది. ఈ విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోడిగుడ్ల టెండర్‌లో నాణ్యత కోసం ప్రభుత్వం విధించిన షరతులను హైకోర్టు సమర్ధించింది. చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు పంపిణీ అయ్యే కోడిగుడ్ల నాణ్యతను నిర్ధారించేందుకు షరతులు అవసరమన్న ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనతో ఏకీభవించిన హై కోర్టు టెండర్ షరతులను సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేసింది. అంగన్ వాడీలకు నాణ్యమైన సరుకులు చేరాలంటే..ప్రభుత్వం విధించిన షరతులను ప్రతి ఒక్క డీలర్ తప్పనిసరిగా పాటించాలని కోర్టు వ్యాఖ్యానించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
