Hyderabad: గోడౌన్లు, టింబర్ డిపోల తరలింపుపై స్పెషల్ ఫోకస్.. సీఎస్ ఆదేశాలతో యాక్షన్‌లోకి GHMC
హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 990 గోదాములు, టీంబర్ డిపో సామిల్లలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో తరలింపు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలతో..
ఫైర్ యాక్సిడెంట్స్ తో ప్రాణాలు తీస్తున్న గోడౌన్లు, టీంబర్ డిపోల తరలిపునకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న 990 గోదాములు, టీంబర్ డిపో సామిల్లలకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో తరలింపు చేయాలని సర్క్యులర్ జారీ చేసింది ప్రభుత్వం. తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశాలతో యాక్షన్‌లోకి దిగారు జీహెచ్ఎంసీ అధికారులు. బోయినపల్లి , మల్లాపూర్, రాణిగంజ్, కుషాయిగూడ ఘటన నేపథ్యంలో సీరియస్ యాక్షన్ మొదలు పెట్టారు. సర్క్యులర్ వన్ ద్వారా తరలింపు ఆదేశాలు ఇచ్చారు. నడిబొడ్డులో ఉన్న సంస్థల తొలగింపుపై కఠినంగా వ్యవహరించనుంది ప్రభుత్వం. సర్వే చేసి.. నివేదిక సిద్ధం చేసింది ప్రభుత్వం. ఇందులో గోడౌన్లు, టీంబర్ డిపో, సామిల్లు ఉన్నాయి.
ఇక స్వప్నలోక్ కాంప్లెక్స్ కార్యకలాపాలు ఇప్పట్లో సాధ్యం కాదని జేఎన్‌టీయూ సివిల్ ఇంజినీరింగ్ నిపుణుల బృందం తేల్చేసింది. అగ్ని ప్రమాద ఘటనతో బిల్డింగ్ పటిష్టత దెబ్బతిన్నదని.. చాలా వరకు నిర్మాణం పటిష్టత కోల్పోయిందని అధ్యయనంలో గుర్తించింది.
మరమ్మతులు జరిపాకే యథావిథిగా కార్యకలాపాలకు అనుమతులు ఇవ్వొచ్చని, ఎక్కడెకక్కడ ఏం జరిగిందో వివరాలను పేర్కొంటూ 15 అంశాలతో కూడిన నివేదికను జేఎన్‌టీయూ బృందం సోమవారం జీహెచ్‌ఎంసీకి సమర్పించింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం