మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. డాక్టర్ చీటీ లేకపోతే.. నో మెడిసిన్.!

Ravi Kiran

Ravi Kiran |

Updated on: Apr 01, 2021 | 6:35 PM

Telangana Government: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో...

మెడికల్ షాపులకు తెలంగాణ సర్కార్ కీలక ఆదేశాలు.. డాక్టర్ చీటీ లేకపోతే.. నో మెడిసిన్.!
Medical Shops

Telangana Government: తెలంగాణలో కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది. హైదరాబాద్‌లోని మెడికల్ షాపులను తెలంగాణ సర్కార్ అప్రమత్తం చేసింది. కోవిడ్ గైడ్‌లైన్స్‌ను మరోసారి అమలు చేయాలని.. దగ్గు, జ్వరం లక్షణాలతో ఉన్నవారికి డాక్టర్ చీటీ లేకుండా మెడిసిన్స్ ఇవ్వొద్దని ఆదేశించింది. అలాగే అన్ని మెడికల్ షాపుల్లోనూ ‘నో మాస్క్ – నో మెడిసిన్’ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేసింది. అటు కరోనా లక్షణాలు ఉన్నవారు నేరుగా ప్రభుత్వాసుపత్రికి వెళ్లాలని సూచించింది.

ఇదిలా ఉంటే కరోనా కేసుల పెరుగుతున్న నేపధ్యంలో తాజాగా వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తాజాగా టర్శరీ కేర్ హాస్పిటల్స్, టీవీవీపీ ఆసుపత్రుల సూపరింటెండెంట్‌లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోసారి యుద్ద వాతావరణంలో పని చేద్దామని.. కరోనా వైరస్ వల్ల మరణాలు సంభవించకుండా చూడాలని మంత్రి తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో PPE కిట్స్, రిమెడ్‌సెవర్ ఇంజెక్షన్లు, N 95 మాస్క్‌లు, లిక్విడ్ ఆక్సిజన్ టాంక్‌లు, బల్క్ సిలెండర్‌లు, టాబ్లెట్స్, డాక్టర్‌లు, సిబ్బంది, బెడ్స్ కొరత లేకుండా చూడాలని సూచించారు. ఎంత మంది సిబ్బంది అవసరం అయినా తాత్కాలిక పద్దతిలో తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్ అన్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Also Read:

ఏపీలో మరోసారి పడగ విప్పిన కరోనా.. భారీగా నమోదైన పాజిటివ్ కేసులు.. ఆ జిల్లాలో అత్యధికం.!

LPG Cylinder: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న గ్యాస్ సిలిండర్ ధరలు.. ఎంతంటే.!

అలెర్ట్: ఆధార్‌తో పాన్ కార్డు లింక్.? చివరి తేదీ పొడిగింపు.. వివరాలివే.!

IPL 2021: సన్‌రైజర్స్ హైదరాబాద్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్.. మరో గుడ్ న్యూస్..!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu