Telangana:ఠాగూర్ నేతృత్వంలో గాంధీభవన్ లో సమావేశాలు.. పార్టీ భవితవ్యాన్ని మారుస్తాయా..?
తెలంగాణ (Telangana) కాంగ్రెస్ నేతలు ఆ రెండు అంశాలే కేంద్రంగా మరోసారి బిజీ కాబోతున్నారా...? ఆ అంశాల కేంద్రంగానే గాంధీ భవన్ లో రెండు రోజుల పాటు కీలక సమావేశాలు జరగనున్నాయా...? ఆ యాత్ర కాంగ్రెస్ పార్టీ తలరాతని మార్చనుందా...? ఠాగూర్...
తెలంగాణ (Telangana) కాంగ్రెస్ నేతలు ఆ రెండు అంశాలే కేంద్రంగా మరోసారి బిజీ కాబోతున్నారా…? ఆ అంశాల కేంద్రంగానే గాంధీ భవన్ లో రెండు రోజుల పాటు కీలక సమావేశాలు జరగనున్నాయా…? ఆ యాత్ర కాంగ్రెస్ పార్టీ తలరాతని మార్చనుందా…? ఠాగూర్ నేతృత్వంలో జరిగే సమావేశాలు దాని కోసమేనా..? వరస సమావేశాలతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు బిజీ బిజీగా గడుపుతున్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఏఐసీసీ వ్యవహారాల ఇంచార్జ్ మానిక్కం ఠాగూర్ హైదరాబాద్ (Hyderabad) లోనే మకాం వేయబోతున్నారు. ప్రధానంగా గాంధీ భవన్ లో రెండు రోజుల పాటు కీలక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో ఠాగూర్ పాల్గొని ముఖ్య నాయకులు అనుబంధ సంఘాలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశాలకు పీఏసీ సభ్యులు, డీసీసీ అధ్యక్షులు హాజరుకావాల్సిందిగా గాంధీ భవన్ నుంచి సమాచారం అందించారు. శనివారం ఉదయం 10 గంటలకు గాంధీ భవన్ లో ఠాగూర్ నేతృత్వంలో లీగల్ సెల్ సమావేశం జరగనుంది. సమావేశానికి పీసీసి చీఫ్ రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. అనంతరం బీజేపీ నేత కత్తి కార్తీక ఠాగూర్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎన్ఎస్ యూఐ తో పీసీసీ చీఫ్ రేవంత్, ఇంచార్జ్ ఠాగూర్ ముఖ్య సమావేశం ఉండనుంది.
ఇక ఆదివారం ఉదయం 11 గంటలకు సీఎల్పీ కార్యాలయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అధ్యక్షతన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో పలు కీలక అంశాలు తాజా రాజకీయాలపై చర్చించనున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అధ్యక్షతన కీలక సమావేశం జరగనుంది. ఠాగూర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. సమావేశంలో పీఏసీ సభ్యులు, పీసీసీ కార్యవర్గ సభ్యులు, అందుబాటులో ఉన్న డీసీసీ అధ్యక్షులు హాజరుకావాలని సమాచారం అందించారు.
ఈ రెండు రోజులు జరిగే సమావేశాల్లో ప్రధానంగా రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా చేపట్టే భారత్ జోడోయాత్ర కు టీ – కాంగ్రెస్ నేతలు రూట్ మ్యాప్ నూ సిద్ధం చేయడంతో పాటు.. ఏఏ ప్రాంతాల్లో రాహుల్ పాదయాత్ర ఉండాలి. ఆ పాదయాత్ర కు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయడానికి ఈ సమావేశాలు జరగనున్నాయి. కన్యాకుమారిలో ప్రారంభమయ్యే ఈ జోడోయాత్ర తెలంగాణలో మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ లో ఎంటర్ అయి, నిజామాబాద్ జిల్లా జుక్కల్ తో తెలంగాణలో ముగించి నాందేడ్ వైపు వెళ్తుంది. ఈ యాత్రతో పాటు ఆగస్టు 2 వ తేదీన సిరిసిల్ల లో రాహుల్ గాంధీ భారీ బహిరంగ సభ, రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, తాజా రాజకీయాలు, చేరికలు వంటి అంశాలపై నేతలంతా చర్చించబోతున్నారు.
తెలంగాణ లో రాహుల్ గాంధీ జోడోయాత్ర దేశంలోనే అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. మరి రాహుల్ జోడోయాత్ర తో పాటు రాహుల్ సిరిసిల్ల సభ విజయవంతం చేయడంలో ఎంత వరకు సఫలీకృతం అవుతారో చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..