AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: ఇకపై మన తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశంలో ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ  ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న..

Telangana: ఇకపై మన తెలంగాణను ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దాం.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
Cm Revanth Reddy
Ashok Bheemanapalli
| Edited By: Ravi Kiran|

Updated on: Aug 09, 2024 | 11:42 AM

Share

కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్​ కంపెనీ ప్రముఖులతో సమావేశంలో ఇకపై మన తెలంగాణ రాష్ట్రాన్ని.. తెలంగాణ  ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ పునర్నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్, నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రాష్ట్రం “ది ఫ్యూచర్ స్టేట్”కు పర్యాయపదంగా నిలుస్తుందని సీఎం ప్రకటించారు. కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్‌టేబుల్‌లో టెక్ యునికార్న్స్ సీఈఓలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ‘ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు. ‘మీ భవిష్యత్తును ఆవిష్కరించుకొండి. అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందాం’ అని పిలుపునిచ్చారు.

‘ఇప్పటి వరకు మేము న్యూయార్క్, న్యూజెర్సీ, వాషింగ్టన్ డీసీ, టెక్సాస్‌లో పర్యటించాం. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్నాం. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఒక ప్రత్యేక లక్ష్యం.. ఆ లక్ష్యాన్ని సూచించే నినాదం ఉంది. అవుటాఫ్ మెనీ.. వన్ అనేది న్యూయార్క్ స్టేట్ నినాదం. టెక్సాస్‌ను లోన్ స్టార్ స్టేట్ అని పిలుస్తారు. కాలిఫోర్నియాకు యురేకా అనే నినాదం ఉంది. మన దేశంలో రాష్టాలకు ఇటువంటి ప్రత్యేక నినాదాలేమీ లేవు. ఇప్పటినుంచి మన తెలంగాణ రాష్ట్రానికి అటువంటి ఒక లక్ష్య నినాదాన్ని ట్యాగ్ లైన్ గా పెట్టుకుందాం. ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్​.. అని పిలుద్దాం..’ అని సీఎం ప్రకటించారు.

ప్రపంచ టెక్ పరిశ్రమలకు తెలంగాణలో అనుకూలమైన వాతావరణం ఉందని మంత్రి డి.శ్రీధర్‌బాబు అన్నారు. పెట్టబడులకు అనుకూలమైన విధానాలను తమ ప్రభుత్వం అనుసరిస్తుందని స్పష్టం చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యునికార్న్ కంపెనీల వ్యవస్థాపకులు స్వయంగా హైదరాబాద్‌ను సందర్శించాలని మంత్రి ఆహ్వానించారు. అక్కడ పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, సదుపాయాలను పరిశీలించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..