Hyderabad: నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌లకు కేసీఆర్‌ ఆతిథ్యం.. ప్రగతి భవన్‌లో క్రీడాకారులతో భోజనం చేసిన సీఎం..

Hyderabad: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌ నిలిచి, తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) గురువారం ఆతిథ్యమిచ్చారు. ప్రగతి భవన్‌లో క్రీడాకారులను కలుసుకున్న ముఖ్యమంత్రి వారితో...

Hyderabad: నిఖత్‌ జరీన్‌, ఇషా సింగ్‌లకు కేసీఆర్‌ ఆతిథ్యం.. ప్రగతి భవన్‌లో క్రీడాకారులతో భోజనం చేసిన సీఎం..
Follow us

|

Updated on: Jun 02, 2022 | 8:42 PM

Hyderabad: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌ నిలిచి, తెలంగాణ కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌, షూటర్‌ ఇషా సింగ్‌లకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ (KCR) గురువారం ఆతిథ్యమిచ్చారు. ప్రగతి భవన్‌లో క్రీడాకారులను కలుసుకున్న ముఖ్యమంత్రి వారితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన వేడుకల్లో క్రీడాకారులిద్దరినీ ఘనంగా సన్మానించి, సీఎం కేసీర్‌ చెరో రూ. 2 కోట్ల నగదు బహుమతిని అందించారు.  నిఖత్‌ జరీన్‌ గోల్డ్ మెడల్ సాధించడానికి పడిన శ్రమ గురించి ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా క్రీడాకారుడైన తన తండ్రి జమీల్ అహ్మద్ తనకు బాల్యం నుంచి అందించిన ప్రేరణ, ప్రోత్సాహం గురించి నిఖత్ కేసీఆర్‌కు వివరించారు.

తాను బాక్సింగ్‌లో శిక్షణ పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, చేసిన ఆర్థిక సాయం తనలో ఎంతో ఆత్మస్థైర్యాన్ని నింపిందని నిఖత్ జరీన్ సంతోషం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే 2014 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ రూ. 50 లక్షల చెక్‌ను అందించారు. కేసీఆర్‌తో కలిసిన సందర్భంగా నిఖత్‌ జరీన్‌ కేసీఆర్‌తో కలిసి ఫొటో దిగారు. నిఖత్ తల్లిదండ్రులు సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపారు. జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పథాకాన్ని సాధించిన ఇషాతో కూడా కేసీఆర్‌ ముచ్చటించారు.

చిన్నతనంలోనే షూటింగ్ క్రీడలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఇషాను సీఎం అభినందించారు. తమ బిడ్డను గొప్ప క్రీడాకారిణిగా తీర్చి దిద్దిన ఇషా తల్లిదండ్రులు సచిన్ సింగ్, శ్రీలతలను సీఎం ప్రశంసించారు. దాదాపు గంట పాటు క్రీడాకారులు వారి కుటుంబ సభ్యులకు ప్రేమపూర్వక ఆథిధ్యమిచ్చి, ఘనంగా సన్మానించిన కేసీఆర్‌ దంపతులు వారికి వీడ్కోలు పలికారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..