Hyderabad: ఎంజే మార్కెట్ వద్ద హైటెన్షన్.. ఏకంగా అసోం సీఎం వద్దకు దూసుకెళ్లిన TRS లీడర్

నగరంలోని ఎంజే మార్కెట్‌ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ విచ్చేసిన కార్యక్రమ వేదిక వద్ద టీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తలు బాహాబాహీకి దిగారు.

Hyderabad: ఎంజే మార్కెట్ వద్ద హైటెన్షన్.. ఏకంగా అసోం సీఎం వద్దకు దూసుకెళ్లిన TRS లీడర్
Hyderabad High Tension
Follow us

|

Updated on: Sep 10, 2022 | 7:07 PM

హైదరాబాద్ ఎంజే మార్కెట్‌లో హైటెన్షన్ చోటుచేసుకుంది. భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి ఆధ్యర్యంలో మొజంజాహీ మార్కెట్‌ చౌరస్తా  వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి వచ్చిన అసోం సీఎం హిమంతను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు యత్నించారు.  భద్రతా వలయాన్ని ఛేదించి.. సభా వేదికపై ఉన్న సీఎం హిమంత బిశ్వ శర్మకు దూసుకువెళ్లాడు స్థానిక  TRS నేత నందకిశోర్‌. అక్కడి మైక్‌ను లాగే ప్రయత్నం చేశారు. దీంతో బీజేపీ నేతలు అతడిని వెనక్కి తోసేశారు.  భాగ్యనగర్‌ గణేశ్‌ ఉత్సవ సమితి నాయకుడు భగవంతరావు మాట్లాడుతుండగా ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఈ క్రమంలో స్టేజ్ కింద టీఆర్‌ఎస్, బీజేపీ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. దీంతో వెంటనే అలర్టైన పోలీసులు.. స్టేజ్‌పైకి దూసుకెళ్లిన టీఆర్‌ఎస్ నేతను అదుపులోకి తీసుకున్నారు. అసోం సీఎంను సురక్షిత ప్రాంతానికి తరలించారు. సీఎం హిమంత భద్రతను పోలీసులు నిర్లక్ష్యం చేవారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

ఈ ఘటన అనంతరం మాట్లాడిన  హిమంత బిశ్వశర్మ తెలంగాణలో ఒక్క ఫ్యామిలీకే మంచి జరుగుతోందని.. మిగిలిన అన్ని కుటుంబాలకు మంచి జరిగేలా చూడాలని భాగ్యలక్ష్మి అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. తెలంగాణకు రజాకార్ల పాలన నుంచి విముక్తి కల్పించాలని పిలుపునిచ్చారు. సర్కార్ అంటే ప్రజలందరి కోసమని.. కోవలం ఒక్క కుటుంబం కోసమే కాదన్నారు.

ఎక్కడి నుంచో వచ్చి.. ఇక్కడ లా- అండ్ ఆర్డర్ చెడగొట్టడం ఎంత వరకూ కరెక్ట్ అన్నారు రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ. బాధ్యత గల ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి అసభ్యంగా మాట్లాడటమేంటని ప్రశ్నించారు మరో మంత్రి తలసాని శ్రీనివాస్. ఏ అంశం గురించి అయితే వచ్చారో.. అదే విషయంపై సీఎం హిమంత బిస్వా మాట్లాడితే బాగుండేదన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
మీ పిల్లల చదువుకు రూ.2 కోట్లు కావాలంటే నెలకు ఎంత SIP చేయాలి?
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
YCP నుంచి వచ్చే రియాక్షన్‌కి తట్టుకోలేరు..TDPకి సజ్జల వార్నింగ్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
కేసీఆర్ చేసిన తప్పులే రేవంత్ కూడా చేస్తున్నారు: ఈటల రాజేందర్
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.