Hyderabad: హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన వీధి కుక్కలు.. ఐదేళ్ల బాలుడిపై విచక్షణారహితంగా దాడి
హైదరాబాద్‌లో మరో భయంకరమైన ఘటన జరిగింది. పాతబస్తీలోని ఓ బాలుడిని దారుణంగా కరిచేసిందో వీధి కుక్క. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడుపై కుక్క హఠాత్తుగా ఎటాక్ చేసింది. దీంతో కుక్క కాట్లకు తీవ్రంగా గాయపడ్డాడు 5 ఏళ్ల బాలుడు.

హైదరాబాద్‌లో మరో భయంకరమైన ఘటన జరిగింది. పాతబస్తీలోని ఓ బాలుడిని దారుణంగా కరిచేసిందో వీధి కుక్క. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడుపై కుక్క హఠాత్తుగా ఎటాక్ చేసింది. దీంతో కుక్క కాట్లకు తీవ్రంగా గాయపడ్డాడు 5 ఏళ్ల బాలుడు. అయితే స్థానికులు సమయానికి స్పందించి ఆ బాలుడిని కాపాడారు. దీంతో పిల్లాడికి ప్రాణాపాయం తప్పింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ సంతోష్‌నగర్ కాలనీలో ఓ ఇంటి ముందు అబ్దుల్ రఫీ అనే 5 ఏళ్ల బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే హఠాత్తుగా పిల్లాడిపై దాడికి పాల్పడింది వీధి కుక్క. అబ్దుల్ రఫీను పట్టుకుని కండ పీకేసింది కుక్క. అదృష్టవశాత్తూ ఆ సమయంలో అటుగా వెళ్తున్నవారు కాపాడడంతో పిల్లాడు ప్రాణాలతో బయటపడ్డాడు. బాలుడిని వెంటనే నారాయణ గూడ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి పరిస్థితి బాగానే ఉందని తెలుస్తోంది.కాగా ఇటీవల హైదరాబాద్‌లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.
చిన్నారులు కనిపిస్తే చాలు ఎక్కడ పడితే అక్కడ కండలు పీకేస్తున్నాయి. కుక్కల దాడులతో ఇంటి నుంచి అడుగు బయట పెట్టాలంటేనే జనం భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో వీధి కుక్కలపై జీహెచ్ఎంసీ అధికారులకు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాలుడి తల్లిండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




మరిన్ని తెలంగాణ వార్తల కోసం.. క్లిక్ చేయండి..