తెలుగు రాష్ట్రాల ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్.. ఆ రెండు రూట్లలో ప్రత్యేక రైళ్లు.. టైమింగ్స్ ఇవే.!
తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్ వచ్చేసింది. ప్రయాణీకుల రద్దీ, పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను కాకినాడ-లింగంపల్లి మధ్య నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని.. స్పష్టం చేసింది.
లింగంపల్లి, ఆగష్టు 28: తెలుగు రాష్ట్రాల రైల్వే ప్రయాణీకులకు బిగ్ అలెర్ట్ వచ్చేసింది. ప్రయాణీకుల రద్దీ, పండుగల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను కాకినాడ-లింగంపల్లి మధ్య నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. ఆయా రైళ్లు సెప్టెంబర్ 1 నుంచి 13 వరకు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయని.. స్పష్టం చేసింది. 07439 ట్రైన్ నెంబర్‌తో కాకినాడ టౌన్ – లింగంపల్లి మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 1 నుంచి 14 వరకు వారంలో మూడు రోజులు(సోమ, బుధ, శుక్ర) నడవనుంది. ఆయా రోజుల్లో ఈ రైలు కాకినాడ నుంచి రాత్రి 8.10 గంటలకు బయల్దేరి.. మరుసటి రోజు ఉదయం 9.15 గంటలకు లింగంపల్లి చేరుకుంటుంది.
ఇక 07440 ట్రైన్ నెంబర్‌తో లింగంపల్లి-కాకినాడ మధ్య నడిచే ఎక్స్‌ప్రెస్ సెప్టెంబర్ 2 నుంచి 14వ తేదీ వరకు ప్రతీ మంగళవారం, గురువారం, శనివారాల్లో ప్రయాణిస్తుంది. ఆయా రోజుల్లో ఈ రైలు సాయంత్రం 6.25 గంటలకు లింగంపల్లి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.10 గంటలకు కాకినాడ టౌన్ చేరుకోనుంది. ఈ రెండు రైళ్లకు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, అకీవీడు, గుడివాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లు స్టాప్పులుగా నిర్ణయించారు. ఈ రైళ్లలో ఏసీ 2 టైర్, 3 టైర్, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉండనున్నాయి.
హైదరాబాద్-ఢిల్లీ ఎక్స్‌ప్రెస్ రీ-షెడ్యూల్..
మరోవైపు సోమవారం అనగా ఆగష్టు 28న ఉదయం 6 గంటలకు బయల్దేరాల్సిన 12723 నెంబర్ హైదరాబాద్-న్యూఢిల్లీ ఎక్స్‌ప్రెస్.. నాంపల్లి స్టేషన్ నుంచి ఉదయం 8.30 గంటలకు బయల్దేరుతుందని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మారిన సమయాలను ప్రయాణీకులు దృష్టిలో పెట్టుకోవాలని.. వివరాల కోసం 139 టోల్‌ఫ్రీ నెంబర్‌కు చేయాలని రైల్వే శాఖ సూచించింది.
RESCHEDULING OF TRAIN No. 12723 HYDERABAD – NEW DELHI EXP ON 28.08.23 IS RESCHEDULED TO DEPART AT 08:30 HRS (INSTEAD OF IT’S SCHEDULED DEPARTURE AT DEP-06:00 HRS ON 28.08.23). DUE TO LATE RUNNING OF IT’S PAIRING TRAIN
— South Central Railway (@SCRailwayIndia) August 27, 2023
మరోవైపు విజయవాడ డివిజన్‌లో జరుగుతోన్న ట్రాక్ మరమ్మత్తుల కారణంగా ఆగష్టు 28 నుంచి సెప్టెంబర్ 3వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేయడమే కాకుండా.. మరికొన్ని రైళ్లను వేరే మార్గాలకు డైవర్ట్ చేసింది దక్షిణ మధ్య రైల్వే శాఖ.. ఆ వివరాలు ఈ ట్వీట్‌లో..
Due to traffic block works for maintenance activity over Vijayawada Division, SCR scheduled from 28th August to 03rd September, the following trains are being Cancelled/ Partially Cancelled/Diverted as detailed below@SCRailwayIndia @RailMinIndia pic.twitter.com/b2f09tQB3d
— DRM Vijayawada (@drmvijayawada) August 26, 2023
మరిన్ని తెలంగాణ వార్తల కోసంఈ లింక్ క్లిక్ చేయండి..