Hyderabad: కదులుతున్న బస్సులోంచి దూకిన వృద్దురాలు.. నువ్వే నా దేవుడివంటూ ఏసీపీని పట్టుకుని ఏడ్చింది.. మ్యాటర్ తెలిస్తే ఫిదా అవుతారు!
ఓ మహిళ వేగంగా పరిగెత్తుకుంటూ రావడం చూసి బస్సులో ఏమైనా మరచిపోయి ఉండి బస్సు కోసం పరుగున వెళ్తుంది అనుకున్నారు. కానీ సదరు మహిళ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్త్ విధుల్లో ఉన్న మహంకాళి ఏసీపీ రవీందర్ ను కలవడానికి వస్తోందని తెలుసుకొని ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్ 2014 సంవత్సరంలో టప్పాచ భుత్ర ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నప్పుడు కార్వాన్‌కు చెందిన కవిత అనే మహిళ.. రోడ్డుపై అనారోగ్యంతో భాధ పడుతుంటే తన సొంత డబ్బులతో అస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించారు. బస్సులో వెళ్తున్న ఆమె..
ఓ మహిళ వేగంగా పరిగెత్తుకుంటూ రావడం చూసి బస్సులో ఏమైనా మరచిపోయి ఉండి బస్సు కోసం పరుగున వెళ్తుంది అనుకున్నారు. కానీ సదరు మహిళ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్ లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ బందోబస్త్ విధుల్లో ఉన్న మహంకాళి ఏసీపీ రవీందర్ ను కలవడానికి వస్తోందని తెలుసుకొని ఆశ్చర్య పోయారు. ప్రస్తుతం మహంకాళి ఏసీపీగా ఉన్న రవీందర్ 2014 సంవత్సరంలో టప్పాచ భుత్ర ఇన్స్‌పెక్టర్‌గా ఉన్నప్పుడు కార్వాన్‌కు చెందిన కవిత అనే మహిళ.. రోడ్డుపై అనారోగ్యంతో భాధ పడుతుంటే తన సొంత డబ్బులతో అస్పత్రిలో చేర్పించి ఆపరేషన్ చేయించారు. బస్సులో వెళ్తున్న ఆమె.. రోడ్డుపై ఉన్న ఏసీపీ ని గుర్తుపట్టి, బస్సు మధ్యలో దిగి వచ్చింది. ఏసీపీని కలిసి సంతోషంలో మునిగిపోయింది. ఈ రోజు బ్రతికి ఉన్నానంటే అందుకు కారణం సార్ అంటూ కన్నీరు పెట్టుకుంది. ‘అన్నా నీ కోసం వెండి రాఖీ కొన్న.. వచ్చి కడుతా’ అని ఆనందం వ్యక్తం చేసింది. మహిళ ఫోన్ లో ఉన్న ఏసీపీ ఫోటో చూసి.. ఆమె కృతజ్ఞతకు ఏసీపీ తో పాటు అందరూ ఆశ్చర్య పోయారు. ఏసీపీ ఫోన్ నెంబర్ తీసుకుని ఆనందంగా వెళ్లి పోయింది.