Hyderabad: మన హైదరాబాద్‌లో రూ.10 కే కమ్మటి బిర్యానీ.. ఎక్కడంటే..?
భోజనం చేయాలన్నా, టిఫిన్ తినాలన్నా 50 నుండి 100 రూపాయిలు లేనిదే పని అవ్వదు. అంత ఎందుకు కప్పు ఛాయ్ తాగాలన్నా 10 రూపాయిలు జేబులో ఉండాల్సిందే. హైదరాబాద్ లోని ఓ ప్రాంతంలో వద్ద బిర్యానీ కేవలం 10కే అమ్ముతున్నారన్న విషయం మీకు తెలుసా..? అదేంటి 10 రూపాయలకు బిర్యానీ ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా..?
హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్..! మన బిర్యానీ ఇప్పుడు దేశమంతటా ఫేమస్..! హైదరాబాద్ బిర్యానీ ఘుమఘుమలు కేవలం మన వద్దే కాదు.. ప్రపంచం నలుమూలలా విస్తరించాయి. ఇప్పుడు అన్ని చోట్లా నోరూరించే బిర్యానీ లభిస్తోంది. అయితే 10 రూపాయలకు బిర్యానీ లభిస్తుంది అంటే.. మీరు ఆశ్చర్యం కలగక మారదు. అవును.. అయితే ఇది చికెన్ బిర్యానీ కాదండోయ్. వెజ్ బిర్యానీ మాత్రమే. సికింద్రాబాద్ రైల్వే ష్టేషన్ పక్కన ఉండే ఆక్సా హోటల్‌లో ఈ 10 రూపాయల బిర్యానీ లభిస్తుంది. అయితే ఈ బిర్యానీ కేవలం వారికి కేవలం ఒక్క రూపాయి మాత్రమే మిగులుతుందట. అది కూడా మెయింటెన్స్, ఇతర ఖర్చుల కోసం సరిపోతుందట. కేవలం సొసైటీకి సేవ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా 10 రూపాయలకు బిర్యాని అందిస్తున్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. లాభాపేక్షతో బిర్యానీ విక్రయించడం లేదని, నలుగురు పేదలకు కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని హోటల్ అంటున్నారు.
బిర్యాని అచ్చం మన ఇంట్లో చేసుకునేలా చాలా టేస్టీగా ఉందని ఇక్కడ తిన్నవాళ్ళు అంటున్నారు. ఆలు, టమాట, క్యాప్సికం, బఠాణి.. ఇలా అన్ని ఈ బిర్యానీలో వేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. దాదాపు 10 ఏళ్లగా ఈ బిర్యానీ సెంటర్ రన్ చేస్తున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బిర్యానీ లభిస్తుంది. అన్నట్లు ఇక్కడ తినడమే కాకుండా పార్శిల్ సౌకర్యం కూడా ఉందండోయ్. ఈ రోజుల్లో 10 రూపాయలకు ఛాయ్ కూడా రావాడం లేదు. అలాంటిది.. వెజ్ బిర్యానీ ఇస్తున్నారంటే మాములు విషయం కాదు కదా.. ఈ సారి అటు వైపు వెళ్లినప్పుడు మీరు కూడా ఈ బిర్యానీ టేస్ట్ చేసి ఎలా ఉందో మాకు చెప్పండి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..